By M.D ABDUL-Tollywoodtimes
చిత్రం : విక్రమ్
విడుదల తేది: జూన్ 3, 2022
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
tollywoodtimes రేటింగ్ : 3.75/5
నటీనటులు: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాణ సంస్థ : రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
వాహ్.. వెండితెరపై యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నట విశ్వరూపాన్ని చూసి ఎన్నాళ్లయింది.. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో రూపుద్దికున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ తప్ పాటు సూర్య అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కమల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘విక్రమ్: హిట్ లిస్ట్’ పేరుతో సుధాకర్ రెడ్డి- హీరో నితిన్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. మరి ఇన్ని అంచనాల మధ్య శుక్రవారం (జూన్ 3, 2022)న విడుదలైన ‘విక్రమ్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే..
కథలోకి వెళదాం.. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపే ఏజెంట్ విక్రమ్ ( కమల్ హాసన్) సస్పెన్షన్‌కు గురై అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాడు. భారీగా డ్రగ్స్‌తో కూడిన కంటైనర్ మిస్ కావడంతో దాని కోసం డ్రగ్ మాఫియా డాన్ సంతానం (విజయ్ సేతుపతి) వెతుకుతుంటాడు. డ్రగ్ లావాదేవీలను అరికట్టేందుకు అమర్ (ఫాహద్ ఫాజిల్) బ్లాక్ ఆపరేషన్ నిర్వహిస్తుంటాడు. అండర్ గ్రౌండ్‌కు వెళ్లిన విక్రమ్.. కర్ణన్ అనే పేరుతో తన కొడుకుకు కారణమైన వారిని చంపుతుంటాడు. మాస్క్ మ్యాన్ పేరుతో ఓ ముఠా వరుస హత్యలకు పాల్పడుతుంది. అందులో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకున్న పోలీసు అధికారి ప్రభంజన్, అతని తండ్రి కర్ణణ్ కూడా ఉంటారు. ఈ ముఠాను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు స్పై ఏజెంట్ అమర్. అతని టీమ్‌తో కలిసి ఈ కేసును ఛేదించే క్రమంలో ప్రభంజన్ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా లీడర్ సంతానం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే అందరూ అనుకున్నట్లుగా కర్ణణ్ చనిపోలేదనే విషయం కూడా తెలుస్తుంది. మరి కర్ణణ్ చనిపోయినట్లు ఎందుకు నటించాడు? అతని నేపథ్యం ఏంటి? అతనికి ఏజెంట్ విక్రమ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు కర్ణణ్ వేసిన ప్లాన్ ఏంటి? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? చివరకు అమర్ వారికి ఏవిధంగా సహాయం చేశాడు? ఈ కథలోకి సూర్య ఎలా ఎంట్రీ ఇచ్చాడు? ఏజెంట్ విక్రమ్ కొడుకు ఎలా హత్య చేయబడ్డాడు. విక్రమ్ కొడుకును ఎవరు చంపారు? మిస్ అయిన డ్రగ్స్ కంటైనర్ కోసం వెతుకులాటలో సంతానం ఎలాంటి క్రూరత్వం చూపాడు? మనవడి కోసం విక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? విక్రమ్, సంతానం మధ్య జరిగే పోరాటంలో అమర్ ఎలాంటి పాత్ర పోషించాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే.. విక్రమ్ సినిమాని చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించాడు లోకేష్ కనగరాజ్. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. కమల్ హాసన్ ఎంట్రీ సీన్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉండటమే కాకుండా కథలోకి తీసుకెళుతుంది. డ్రగ్స్ నేపథ్యంగా నడిచే రెగ్యులర్ పాయింటే. కానీ స్టార్ వాల్యూ, మేకింగ్ స్టాండర్డ్స్ సినిమాను కొత్తగా మార్చాయి. హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రభావంతో లోకేష్ కనకరాజ్ రాసుకొన్న కథ, కథనాలు ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు. విజయ్ సేతుపతి, కమల్ హాసన్, ఫాహద్ పాజిల్, సూర్య పాత్రలను కథలోకి జొప్పించిన విధానం, బలంగా ఆ పాత్రలను మలిచిన తీరు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారడమే కాకుండా లోకేష్ కనకరాజ్ ప్రతిభను మరోసారి బయటపెట్టాయి. విజయ్ సేతుపతి పాత్ర పరిచయం పవర్‌ఫుల్‌గా, భయానకంగా ఉంది. ఆ తర్వాత ఫాహద్ ఫాజిల్ పాత్ర ఎంట్రీ మరో హైలెట్. ఇంటర్వెల్‌లో కమల్ హాసన్‌కు సంబంధించిన ఓ సీన్ కథను మరో మలుపు తిప్పేలా చేస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో కథ ఎక్కడా కనిపించకుండా కథనమే డామినేట్ చేస్తుంది. సెకండాఫ్ పవర్ ఫ్యాక్ట్‌గా ఫీల్ గుడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత అసలు కథ చెప్పడంతో విక్రమ్ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. నా కొడుకును చంపిన వాళ్లను చంపడం నా లక్ష్యం కాదు.. డ్రగ్స్ లేని సమాజంలో నా మనవడిని చూడాలని అనుకొంటున్నాను అనే కమల్ చెప్పిన డైలాగ్‌తో అప్పటి వరకు సాగిన సినిమా స్వరూపం ఒక్కసారిగా మారిపోతుంది. ఇక యాక్షన్, థ్రిల్లింగ్, సెంటిమెంట్ ఎలిమెంట్స్‌తో కథ బలంగా కనిపిస్తుంది. చివర్ల సూర్య ఎంట్రీ సినిమాకు మరో హైలెట్. కథకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. సీన్లను పేర్చుకొంటూ వెళ్లి చేసిన సరికొత్త ప్రయోగం విక్రమ్. లోకేష్ కనకరాజన్ స్టైలిష్ యాక్షన్‌కి పెట్టింది పేరు. అలాంటి దర్శకుడికి కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి దిగ్గజ నటులు దొరికితే.. ఎలా ఉంటుంది? యాక్షన్ సీన్స్‌ని వేరే లెవల్‌లో చూపించొచ్చు. విక్రమ్‌లో కనకరాజన్ అదే చేశాడు. యాక్షన్స్ సీన్స్‌తో అదరగొట్టేశాడు. కథలో కావాల్సినన్ని ట్విస్టులు, ఎలివేషన్స్ ఉన్నాయి. డ్రగ్స్ మాఫియా చుట్టూ విక్రమ్ కథ తిరుగుతుంది. భారీ స్థాయిలో డ్రగ్స్‌ని పట్టుకోవడం, దాని ఆచూకీ కోసం సంతానం ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో వరుస హత్యలు.. స్పై ఏజెంట్ అమర్ రంగంలోకి దిగడం.. కర్ణణ్ గురించి కొన్ని నిజాలు తెలియడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక ఫస్టాఫ్‌లో సాదా సీదాగా అనిపించిన సీన్లను సెకండాఫ్‌కు ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో అయితే యాక్షన్ డోస్ భారీగా పెంచేశాడు. 1987 నాటి ‘విక్రమ్’ సినిమాకు, అలాగే లోకేష్ కనకరాజన్ గత చిత్రాలు ‘ఖైదీ’, ‘మాస్టర్’కి ఈ చిత్రాన్ని లింక్ చేసిన విధానం బాగుంది. ఇక క్లైమాక్స్‌లో అయితే కమల్ హాసన్ చేసే యాక్షన్ సీన్స్.. రోలెక్స్ పాత్రలో సూర్య ఎంట్రీ అదిరిపోతుంది. మంచి ఇంట్రడక్టన్ సన్నివేశంతో లోకనాయకుడు కమల్ హాసన్ ఎంట్రీ ఇస్తారు. కమల్ పాత్ర ఎంత బలంగా ఉండబోతోందో ఇంట్రడక్షన్ లోనే చెప్పేస్తారు. స్టైలిష్ యాక్షన్ కి లోకేష్ కనకరాజ్ పెట్టింది పేరు. విక్రమ్ చిత్రం కూడా అదే తరహాలో మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా మొదలైనప్పటికీ అక్కడక్కడా వచ్చే థ్రిల్స్ మెప్పిస్తాయి. విజయ్ సేతుపతి ఇంట్రడక్షన్ అయితే అదిరిపోతుందనే చెప్పాలి. అద్భుతంగా విజయ్ పాత్రని లోకేష్ ఇంట్రడ్యూస్ చేశారు.
ఎవరెలా చేశారంటే.. విక్రమ్ పాత్రలో లోక నాయకుడు కమల్ హాసన్ ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రలో నటించడం ఒక్క కమల్‌కే సాధ్యమయింది. యాక్షన్ సీన్స్‌లో కమల్ చూపించే యాటిట్యూడ్ అదిరిపోయింది. అలాగే ఫస్టాఫ్‌లో తాగుబోతుగా, డ్రగ్స్ బానిసగా తనదైన నటనతో ఆదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో కమల్ చేసే ఫైట్స్ సీన్ సినిమాకే హైలైట్. ఇక స్పై ఏజెంట్ అమర్‌గా ఫహద్ ఫాజిల్ మంచి నటనను కనబరిచాడు. యాక్షన్ సీన్స్‌లో, ఎమోషనల్ సీన్స్‌లో వాహ్..అనిపించాడు. ఇక విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ పాత్రలోనైనా అవలీలగా నటిస్తాడు. డ్రగ్స్ మాఫీయా లీడర్ సంతానం పాత్రలో విజయ్ సేతుపతి పరకాయ ప్రవేశం చేశాడు. అతని గెటప్ కానీ, యాక్టింగ్ కానీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక క్లైమాక్స్‌లో రోలెక్స్‌గా సూర్య ఎంట్రీ అదిరిపోతుంది. తెరపై ఉన్నది కొద్ది క్షణాలే అయినా.. తనదైన నటనతో ఓ మెరుపు మెరిశాడు.
సాంకేతిక విషయానికొస్తే..ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టాడు. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడంలో గ్రౌండ్ స్కోర్ బాగా పని చేసింది. గిరీష్ గంగాధరణ్ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగున్నాయి. ఫైట్స్ సీక్వెన్స్ కొత్తగా అనిపించాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగానే ఉన్నాయి. ఈ సినిమాకు స్టార్ వాల్యూ కొండంత బలంగా మారింది. ఈ ‘విక్రమ్’ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. ఓవరాల్ గా చిత్రం బావుంది.