హీరో విజయ్-త్రిష చెన్నైలో జరిగిన ఓ పెళ్లిలో సందడి చేశారు. విజయ్ భార్య సంగీత ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన తర్వాత ఈ జంట ఒకే కారులో వచ్చి వివాహ రిసెప్షన్‌లో పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు.. వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారమే లక్ష్యంగా టీవీకే అధినేత, నటుడు విజయ్ దూసుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో విజయ్ వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలిచింది. ఓ నటితో విజయ్ ఉంటున్నాడని బీజేపీ నేత ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పారు. అంతలోనే విజయ్ భార్య సంగీత కూడా బాంబ్ పేల్చింది. తన భర్త ఒక నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. 2025 డిసెంబర్‌లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపింది. భార్య ఆరోపణలతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కుటుంబ న్యాయస్థానంలో ఉంది. తదుపరి విచారణ ఏప్రిల్ 20న జరిగే అవకాశముంది. ఇలాంటి తరుణంలో విజయ్-త్రిష కలిసి ఒకే కారులో వచ్చి వివాహ రిసెప్షన్‌కు హాజరుకావడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. నిర్మాత కల్పతి ఎస్. సురేష్ కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. అయితే విజయ్-త్రిష కలిసి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరి కళ్లు ఆ జంటపైనే ఫోకస్ అయ్యాయి. మీడియా కూడా ప్రధానంగా హైలెట్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. విజయ్-త్రిష గతంలో ‘ఘిల్లి’, ‘తిరుపాచి’, ‘లియో’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య స్నేహం ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎప్పుడు ఇద్దరూ బయటపడలేదు. తాజాగా విజయ్ భార్య ఆరోపణల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా కలిసి పెళ్లికి హాజరుకావడంతో బంధంపై క్లారిటీ వచ్చినట్లేనని చర్చ నడుస్తోంది.
పెళ్లిలో త్రిషతో కలిసి విజయ్ సందడి..సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
