వెంకన్న పాదాలు… భక్త జనాన్ని సంకటాల నుండి రక్షించే అభయ వేదాలు..

Venkanna's feet... the Abhaya Vedas that protect the devotees from troubles..
Spread the love

నమ్ముకున్న వారి ఇంట సిరి సౌభాగ్యాలు కురిపించే
ఐశ్వర్య లక్ష్మీ చిరు నవ్వుల నాదాలు..
ఈ విషయం …
తెలుగునాట తిరుమల తిరుపతి పద్మావతి అలివేలు మంగా సమే త శ్రీనివాస చరణారవింద శరణాగతులు అందరికీ అనుభవైక వేద్యమైన అనుభూతి!!
స్వామి వారి శక్తికి…
ఆర్త రక్షణా యుక్తికి
ఎన్నో ఎన్నెన్నో నిదర్శనల
ప్రదర్శనలు తెలిసినవి కొన్నే తెలియనివి ఎన్నో!!
తెలుగునాట లక్షల కుటుంబాలకు ఇలవేల్పు
సిరితాల్పు అయిన ఆ శేషాద్రి వాసుడు.. ఏడు కొండలవాడు..వెంకటరమణుడు….గోవిందుడు…
అలానే ….తెనాలి కి చెందిన చదలవాడ వారి కుటుంబానికి
కూడా ఆ ఆనందానిలయ వైకుంఠధాముడే రక్ష అని మనసా వాచా నమ్మి షోడశోపచార నవవిధ భక్తులతో అను నిమిషం కొలిచింది ఆ కుటుంబం.
ఆ శ్రీనివాస వర కృపా కటాక్షానికి నిదర్శనంగా ఆ ఇంట పుట్టిన త్రిమూర్తులకు
తిరుపతిరావు, వేంకటేశ్వర రావు, శ్రీనివాసరావు పేర్లు పెట్టుకుని భక్తి ప్రపత్తులతో పులకించి పరవశించారు ఆ తల్లి తండ్రులు…
సోదర త్రయం లో సోదర ద్వయం అయిన తిరుపతిరావు గారు శ్రీనివాసరావు గారు
తిరుమల పెరుమాళ్లు దయా దృష్టి తో కలప వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి అగ్రస్థానానికి చేరారు. ఎషియన్ టింబర్స్ పేరుతో కలప వ్యాపారంలో తిరుగులేని చక్రవర్తులు అయ్యారు.
చదలవాడ వారి ఇంట జరిగిన ఈ తాజా ఘటన…
కొంగుబంగారమై నిలిచే కలియుగ దైవం ఘటనా ఘట సమర్థతకు నిలువెత్తు నిదర్శనం.
ఇటీవల కలప వ్యాపారంలో నిత్య కార్యక్రమాలలో భాగంగా ఫిబ్రవరి 28 శని వారం నాడు కార్మీకులు ఓ కలప దుంగను కోతకు సిద్ధం చేశారు.
ఆరోజు చదలవాడ వారి ఇంట
వెంకన్న తన లీలా వినోదాన్ని చాటేందుకు ఆ కలప దుంగలో లోకాలకు శరణాగతి అయిన పవిత్ర చరణాల ను నిక్షిప్తం చేశారని వారికి తెలియదు…
వారు కోత మిషన్ ఎక్కించారు… ఆ కలప దుంగను
అప్పుడా క్షణాల లో జరిగింది ఓ అద్భుతం!
ఆ దుంగలో నుండి ఏడేడు లోకాలు యేలేటి ఏడేడు శిఖరాల వెంకన్న పవిత్ర చరణాలు సహస్ర కోటి సూర్య కిరణాలతో ఉద్భవించాయి!!
అంతే ఆ కార్మికుల నయనాలు ఆ వెలుగును చూడలేక ఆశ్చర్యంతో అ ప్రయత్నంగా మూతపడ్డాయి!!
ఒక్క క్షణం వారు జరిగింది గ్రహించారు.
అంతే ఒక్కసారి వారు అందరూ ఏదో అదృశ్యశక్తి అవహించినట్టు…ఒక్కసారే వారి గొంతులనుండి ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా!!
అనే శరణాగతి తో ఎషియన్ టింబర్స్ ఆవరణ ప్రతిధ్వనించింది.
అంతే నిమిషాలలో తిరుపతిరావు , శ్రీనివాసరావు సోదర ద్వయానికి ఈ వార్త చేరింది.
వారు తమ వయసు కూడా లెక్క చేయకుండా పరుగు పరుగునా వచ్చారు.
స్వయంభూ గా అవతరించిన శ్రీనివాస చరణారవిందాలకు సాష్టాంగ ప్రణామాలు అర్పించారు.
ఈ వార్త తెలిసి ప్రజలు చదలవాడ వారి ఇంట కలియుగదైవం కోరి కొలువై
వారి ఇంటిని కలియుగ వైకుంఠం గా మార్చారని చెప్పుకుంటున్నారు!!
ఈ వార్త విస్తృతంగా ప్రచారం అయితే… ఎషియన్ టింబర్స్ మరో తిరుమల క్షేత్రం అవుతుంది.
ఆ శ్రీనివాసుని లీలావినోదం చదివిన
మనం కూడా ఒక్క సారి ఆ శ్రీనివాసుని నామం భక్తి తో పలికి పులకిద్దాం!!
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా……గో… విం….. దా

Related posts