చేతన్, కావ్య, రాజీవ్ హీరో హీరోయిన్లుగా ఆలాపన స్టూడియోస్ సమర్పణలో కోన రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘వశం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా .. దర్శక, నిర్మాత కోన రమేష్ మాట్లాడుతూ .. సిటీ మరియు గిరిజన ప్రాంతంలో జరిగే కథ. సిటీలో పెరిగిన ఒక వ్యక్తి గిరిజన ప్రాంతంలోని అమ్మాయిని ఎంతగానో ప్రేమించి, చివరికి సీటీలోనే అమ్మాయినే ఎందుకు పెళ్లి చేసుకోవలసి వచ్చింది? ఇంతకీ వాస్తవానికి ఏమి జరిగిందనే ఆసక్తికరమైన కథ. గిరిజన ప్రాంతం నేపథ్యంలో జరిగే కథ ఇది . బెంగళూరు.. హైదరాబాద్‌లలో తదితర ప్రాంతాల్లో తెరకెకెక్కించాం. కాండ్రేగుల చందు, సలాపు మోహనరావు, కుబిరెడ్డి వెంకన్న దొర గార్ల సహకారం మరువలేనిది. వారి సంపూర్ణ సహకారంతో సినిమా చక్కగా తెరకెక్కింది. తెలుగు, కన్నడ భాషల్లో ఫిబ్రవరిలో భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. సినిమాను ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరించాం. నటీనటులంతా ఎంతో చక్కగా తమ పాత్రల్లో జీవించారు. ఇందులో ప్రతీ సన్నివేశం ఎంతో ఉత్కంట గా అందర్నీ ఆకట్టుకుంటుంది అని దర్శకుడు కోన రమేష్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే -దర్శకత్వం, కొరియోగ్రఫీ : కోన రమేష్, నిర్మాతలు : కోన రమేష్,యెన్నం శెట్టి ఆంజనేయులు, కో ప్రొడ్యూసర్స్ : రేగం మత్యలింగం , (ఎమ్మెల్యే), పొతూకూరి దేముడు, వడిగొండ అర్జున అప్పారావు, డీఓపీ : శంకర, సంగీతం : కిరణ్ తోటంబ్లే, ఆర్ట్ డైరెక్టర్ : మంజుల, కో డైరెక్టర్స్ : నవీన్ రామ్ నల్లం రెడ్డి, చెక్క ప్రేమ్ జీ ,నని సత్తిబాబు, సుబ్బు, చందు, వెంకట్. పి.ఆర్.ఓ : బాబు నాయక్
విడుదలకు ‘వశం’ సిద్ధం
