పెళ్లిపీటలెక్కబోతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌!

Tollywood heroine who is going to get married!
Spread the love

రంగులరాట్నం, ఉనికి, తెల్లవారితే గురువారం చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ అందాల హీరోయిన్‌ చిత్ర శుక్లా పెళ్లిపీటలెక్కబోతుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారితో చిత్ర శుక్లా ఏడడుగులు వేసేందుకు రెడీ అయింది. మరో రెండు రోజుల్లో వివాహం జరగనుండగా, ప్రస్తుతం ఈ ఇద్దరూ పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను చిత్ర శుక్ల సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేసింది. మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్ర శుక్లా.. పులి, నేను శైలజ లాంటి సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్‌గా నటించి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2016 లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘మా అబ్బాయి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తెలుగులో ‘రంగుల రాట్నం’, సిల్లీ ఫెలోస్‌, తెల్లవారితో గురువారం, పక్కా కమర్షియల్‌, ఉనికి, హంట్‌ తదితర చిత్రాల్లో నటించింది.

Related posts

Leave a Comment