వరద బాధితులకు అండగా సినీ సెలబ్రిటీలు

celebrities donates huge amount to telangana cm relief fund
Spread the love

మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి రూపాయల విరాళం
గడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణ నష్టంతో పాటు, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి భీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత సాయం వాళ్లని చేయమని ఈ సందర్భంగా కోరుతున్నానని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

తెలంగాణలో వరద బాధితులకు రెబల్ స్టార్ ప్రభాస్ విరాళం 1 కోటి 50 లక్షలు
తెలంగాణ లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్ధం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సీఎం సహయనిధి కి తన వంతు సాయంగా 1 కోటి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.

https://twitter.com/IamEluruSreenu/status/1318593856904986630

పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం

వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.
ఈ మేరకు బుధవారం రాత్రి వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కరోనా మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ వర్షాలు, వరదలు తోడయ్యాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల మూలంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఇబ్బందులు పాలవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా లేనంత వర్షపాతం దేశం మొత్తం చూసింది. తెలంగాణలో దీని తాకిడి మరింత ఎక్కువగా ఉంది. చాలామంది జీవన విధానం చిన్నాభిన్నం అయింది. హైదరాబాదులో ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసి ఆస్తి నష్టం జరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సరిగా లేకపోవడం ఒక కారణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులను అర్థం చేసుకుని, ప్రజలు పడుతున్న కష్టాలు చూసి… ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా వంతుగా కోటి రూపాయలు ప్రకటిస్తున్నాను. జనసైనికులు, అభిమానులు, నాయకులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కలిసికట్టుగా ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సమయం ఇది” అన్నారు.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కోటి రూపాయ‌ల విరాళం

గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకోవడానికి సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు తెలంగాణ సీ ఎం సహయనిధికి కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు, “తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సామాన్యులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ విప‌త్తు వ‌ల్ల సంభవించిన వినాశనం మనం ఊహించనిది. బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి తమ వంతు కృషి చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ వారికి అభినందనలు. నా వంతు సాయంగా తెలంగాణ సీ ఎం సహయనిధికి కోటి రూపాయ‌లు విరాళంగా ఇస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో మన ప్రజలకు అండగా వీలైనంత సహాయం అందించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను” అని అన్నారు.

తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షల విరాళాన్ని ప్రకటించిన‌ కింగ్ అక్కినేని నాగార్జున
కొన్ని రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తభించిపోయింది. బాధితులను ఆదుకోవడానికి కింగ్ అక్కినేని నాగార్జున వెంటనే స్పందించారు. రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించి తన పెద్ద మనసుని చాటుకున్నారు.
” భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో సామాన్యులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం తెలంగాణ ప్రభుత్వం వెంటనే రూ.550 కోట్ల విడుదల చేయడం మంచి పరిణామం. నా వంతుగా రూ.50 లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందిస్తున్నాను” అన్నారు.

వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ 50 లక్షల విరాళం ప్రకటించారు. యంగ్ హీరో రామ్ రూ. 25 లక్షలు ప్రకటించారు. హీరో రవితేజ రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ రూ. 10 లక్షలు ప్రకటించారు.

హైదరాబాద్ వరద బాధితుల కోసం ”విజయ్ దేవరకొండ” రూ.10 లక్షల విరాళం
హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు యంగ్ హీరో విజయ్ దేవరకొండ ముందుకొచ్చారు. తన వంతుగా 10 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని అందించారు. ట్విట్టర్ ద్వారా విజయ్ దేవరకొండ స్పందిస్తూ…”మనం కేరళ కోసం, చెన్నై కోసం, సైనికుల కోసం అండగా నిలబడేందుకు ముందుకొచ్చాం. కరోనా టైమ్ లో వేలాది మందికి సహాయాన్ని అందించాం. ఇప్పుడు మన నగరం కోసం అండగా నిలబడేందుకు ముందుకొద్దాం. నా వంతుగా 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నా. మీ అందరూ కూడా మన హైదరాబాద్ కోసం తోచినంత సాయం చేయండి ” అంటూ పిలుపునిచ్చారు..విజయ్ దేవరకొండ విరాళంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ”చాలా థాంక్స్ బ్రదర్” అంటూ రీట్వీట్ చేశారు.

రూ.10 లక్షల విరాళం ప్రకటించిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు)
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో వరద తాకిడికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తమ వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు). ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయక చర్యల కోసం తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.10 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ మేరకు సంయుక్తంగా ఒక ప్రకటన‌ చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, సురక్షితంగా ఉండాలని అభిలషించారు.

వీరే కాకుండా..
హరీష్ శంకర్ రూ. 5 లక్షలు
అనిల్ రావిపూడి రూ. 5 లక్షలు
బండ్ల గణేష్ రూ. 5 లక్షలు
నిర్మాత మహేష్ కోనేరు 1000 కేజీల బియ్యం, 500 బ్లాంకెట్స్
త్రినాధ్ వెలిశిల రూ. 50 వేలు (మేకసూరి డైరెక్టర్)

ప్రకటించి కష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి, హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలిచారు.

Related posts

Leave a Comment