ఈ మూడో సినిమాకి మాత్రం చాలా పెద్ద పెద్ద సాంకేతిక నిపుణలని తీసుకొచ్చాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకి ఛాయాగ్రహణం అందిస్తున్నారు, అలాగే ఆస్కార్ అవార్డు విజేత, అగ్ర సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు, ఈ ఇద్దరూ కాకుండా, ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లని కూడా తీసుకున్నాడు. ఇలా ఈ మూడో సినిమాకి ఇంతమంది పెద్ద సాంకేంతిక నిపుణులని తీసుకోవడమే కాకుండా, ఈ సినిమా లాంచ్ చెయ్యడానికి ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చారు. ఇలా మూడో సినిమాకి దిల్ రాజు తన అన్న కుమారుడి విజయం కోసం అన్నీ సమకూరుస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు అరుణ్ భీమవరపు కొత్తగా మొదలెట్టిన దిల్ రాజు ప్రొడక్షన్స్ మీద దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కమర్షియల్‌గా ఈ సినిమా భారీ విజయం సాధించకపోయినా.. ఆశిష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఆయన సెల్ఫిష్ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. సుకుమార్ శిష్యుడు విశాల్ కాశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, దిల్ కుష్ సాంగ్ సినిమాపై మంచి హైప్‌ను క్రియట్ చేసింది. లవ్‌టుడే భామ ఇవాన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సుక్కు కథ, స్క్రీన్‌ప్లేతో పాటు సహ నిర్మాతగా వ్యవహరి స్తున్నాడు. ఇక ఇదలా ఉంటే ఆశిష్ తాజాగా తన మూడో సినిమాను ప్రారంభించాడు. హైదరాబాద్‌లో ఈ సినిమా ముహూర్తపు వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఎమ్.ఎమ్ కీరవాణి, శ్రీరామ్, అవినాష్ కొల్లా ఇలా స్టార్ టెక్నికల్ టీమ్ అంతా ఈ సినిమాలో భాగం కానుంది. కామెడీ కమ్ హార్రర్ జానర్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాకు అరుణ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా కథ చాలా డిఫరెంట్‌గా, సరికొత్త కాన్సెప్ట్‌తో ఉండనుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆశిష్ మూడో సినిమాకు ముహూర్తం.. అగ్రశ్రేణిని రంగంలోకి దింపిన దిల్‌రాజ్
