వాళ్ళ చిత్రాలలో ఆమె నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సీనియర్ హీరోలందరికీ ఆమె ఒక పర్ఫెక్ట్ మ్యాచ్‌గా నిలవడానికి ముఖ్య కారణం.. పాత్రలను ఎంచుకునే విధానం, ఆమె పర్సనాలిటీ. ఆ పాత్రలకు తగ్గట్టుగా తనను తాను మేకోవర్ చేసుకుంటుంది ఈ బ్యూటీ. అందుకే ఆమె దక్షిణాదిన కదిలించలేని కోట కట్టేసుకుంది. సీనియర్ హీరోల చిత్రాలతో పాటు.. నయనతారకు మరో అరుదైన ఘనత ఉంది. తెలుగు, మలయాళం, తమిళంతోపాటు హిందీలోనూ సత్తా చాటుతూ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి నయనతార. తన 20 ఏళ్ల కెరీర్‌లో 75కి పైగా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా విజయవంతంగా రాణిస్తుంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘నయనతారా: బియాండ్ ది ఫెయిరీ టేల్’తో మరోసారి హైలైట్స్ అయిన ఆమె, ధనుష్‌తో కాంట్రవర్సీలో కూడా స్ట్రాంగ్‌గా నిలబడింది. దక్షిణాదిన అందరు స్టార్ హీరోల సరసన నటించిన నయన్ బాలీవుడ్లో ఎంట్రీతోనే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సరసన్ ఛాన్స్ కొట్టేసి ‘జవాన్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. అయితే నయన్ తన కెరీర్ కొన్ని సూపర్‌హిట్ సినిమాలను కూడా రిజెక్ట్ చేసింది. నయన్ వదులుకున్న ఆ హిట్ సినిమాలేంటో చూద్దాం.. షారుఖ్ ఖాన్, దీపికా పదుకోణే హీరోహీరోయిన్‌లుగా రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్. 400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రారంభంలో ‘1 2 3 4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్’ ఐటమ్ సాంగ్‌కి నయనతారను అప్రోచ్ అయ్యారు. ఈ ఆఫర్‌ని చేసింది. నయనతారకి బదులు ప్రియమణి ఈ సాంగ్ చేసింది. కార్తి హీరోగా ఎన్. లింగుస్వామి డైరెక్షన్‌లో వచ్చిన ‘పైయా’తమిళ యాక్షన్ థ్రిల్లర్, 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మొదట హీరోయిన్గా నయన్‌ను ఎంపిక చేయాలనుకున్నారట దర్శకనిర్మాతలు. కానీ ఆమె పలు కండిషన్స్ పెట్టడంతో నయన్‌ని కాదని ఈ పాత్రకి తమన్నాని ఎంపిక చేశారు. ఉదయనిధి స్టాలిన్ డెబ్యూ మూవీగా ఎమ్. రాజేష్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఓరు కాల్ ఓరు కన్నాడి’ కామెడీ ఎంటర్టైనర్ 100 కోట్లు వసూలు చేసి సూపర్‌హిట్‌గా నిలిచింది. హీరోయిన్ రోల్‌కి మొదట నయనతారాను అప్రోచ్ అయ్యారు, కానీ డేట్స్ బిజీగా ఉండటంతో ఈ సినిమాను వదులుకుంది. దాంతో మరో హిట్ సినిమా మిస్ చేసుకుంది. సూర్య హీరోగా హరి డైరెక్షన్‌లో వచ్చిన ‘సింగం 2’ కాప్ యాక్షన్ సీక్వెల్ 150 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ‘వాలే వాలే’ స్పెషల్ సాంగ్‌కి నయనతారను అడిగారు. కానీ నయన్ రిజెక్ట్ చేసింది. దాంతో అంజలి ఈ పాటలో పెర్ఫార్మ్ చేసింది. ధనుష్ హీరోగా మిథున్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఫ్రెండ్‌షిప్ డ్రామా ‘థిరు చిత్రం బలం’ 200 కోట్లు సేకరించి పాన్ఇండియా హిట్‌గా నిలిచింది. మొదట ఈ సినిమాలో కీ రోల్‌కి నయనతారను అప్రోచ్ అయ్యారు. నయన్ రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలో నిత్యామీనన్ నటించింది. ఇవేకాదు ‘వకీల్ సాబ్’, ‘ది లెజెండ్’ వంటి సినిమాలను కూడా పలు కారణాల వల్ల వదులుకుంది. కొన్ని సినిమాలకి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం మరికొన్ని సినిమాలకు రెమ్యునరేషన్ కారణాలుగా ఉన్నాయి. అయినప్పటికీ శ్రీ రామరాజ్యం, జవాన్, గాడ్‌ఫాదర్, సైరా నరసింహారెడ్డి, దర్బార్, అన్నాత్తై.. వంటి సూపర్‌హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుని లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తోంది నయన్!
నయన్ వదులుకున్న సూపర్‌హిట్ మూవీస్ ఇవే…
