ది ప్యారడైజ్ మూవీ రివ్యూ : చరిత్రకు దృశ్యరూపం

'The Paradise' Movie Review: A Visual Embodiment of History
'The Paradise' Movie Review: A Visual Embodiment of History
Spread the love

చిత్రం: ది ప్యారడైజ్‌
3.25/5
నటీనటులు: నాని, మోహన్‌బాబు, కయాదు లోహర్‌, రాఘవ్‌ జుయల్‌ , సోనాలి కుల్‌కర్ణి, ఈశ్వ‌రీ రావు, సంపూర్ణేశ్‌బాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, కీర్తి సురేశ్‌ తదితరులు.
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌,
నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి,
రచన, దర్శకత్వం: శ్రీకాంత్‌ ఓదెల
సినిమాటోగ్రఫీ : సాయి సీహెచ్,
ఎడిటర్: నవీన్ నూలి,
ప్రొడక్షన్ డిజైనర్: అవినాశ్ కోల్ల,
డైలాగ్స్: తోట శ్రీనివాస్,
క్యాస్టూమ్ డిజైనర్: అజయ్ కుమార్ జే,
సౌండ్ డిజైన్: సురేన్ జీ, అలగై కూతన్
బ్యానర్: ఎస్ఎల్‌వీ సినిమాస్
విడుదల : 24, సెప్టెంబర్ 2026

టాలీవుడ్ ప్రేక్షకులకు లవర్‌ బాయ్‌గా, పక్కింటి కుర్రాడిగా నాని సుపరిచితుడే. అతడిలోని మాస్‌ కోణాన్ని కొత్తగా ఆవిష్కరించిన చిత్రం ‘దసరా’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి హిట్‌ కాంబినేషన్‌లో వచ్చిన మరో మాస్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు రిలీజ్‌  అయిన పాటలు,  టీజర్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. సాఫ్ట్ హీరోగా ఇమేజ్ ఉన్న నాని…మాస్ క‌థ‌తో సినిమా చేయ‌డంతో ఆరంభం నుంచే ‘ప్యార‌డైజ్’ తెలుగు ఆడియెన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తూ వ‌చ్చింది. ఒకప్పుడు నాని అంటే క్లాస్‌ ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు గుర్తొచ్చేవి. పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో అలరించేవాడు. కానీ ‘దసరా’తో తన రూట్‌ మార్చాడు. మాస్‌ యాక్షన్‌ సినిమాలు చేస్తూ తనలోని వయెలెంట్‌  యాంగిల్‌ని చూపిస్తున్నాడు. అలా ఇప్పటి వరకు చూడని మాస్‌  అవతారంతో వచ్చిన చిత్రమే ఇది. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ కాంబోలో సినిమా అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. ఈ కాంబోకి ట్రేడ్ వర్గాల్లో మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ట్రైలర్‌ రిలీజ్‌ చేయకపోయినా హైప్‌ మాత్రం ఒక రేంజ్‌లో వచ్చింది. క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో మోహ‌న్‌బాబు విల‌న్‌గా క‌నిపించారు. సోనాలి కుల‌క‌ర్ణి ఓ కీల‌క పాత్ర పోషించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, మ్యూజిక్ ఇప్పటికే సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేసింది. ట్రైలర్‌ లేకుండా కేవలం కంటెంట్‌ మీద నమ్మకంతో నేరుగా థియేటర్‌లో గురువారం (24, సెప్టెంబర్ 2026) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ‘జడల్‌’గా నాని చేసిన మాస్ ప్రయోగం ఫలించిందా? మోహన్‌బాబు విలనిజం సినిమాకు ఎలాంటి బలాన్ని ఇచ్చింది? శ్రీకాంత్ ఓదెల మరోసారి తన మార్క్ చూపించాడా? ద‌స‌రా త‌ర్వాత ప్యార‌డైజ్‌తో నానికి డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల మ‌రో హిట్టు ఇచ్చాడా? లేదా? భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో తెలుసుకుందాం…
కథ : సినిమా అంతా 80ల కాలంలో జరుగుతూ ఉంటుంది. 1947లో మొదలై 80లలొ ముగుస్తుంది. సికింద్రాబాద్ దగ్గర ఉన్న పారడైజ్ ప్రాంతంలో ఒక గుర్తింపు కూడా లేని తెగ సవారీలు. అణచివేతకు గురైన ఆ తెగ చుట్టే కథ తిరుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. సవారి జాతికి మాత్రం స్వాతంత్రం రాదు. వారు ఇంకా బానిసలుగానే బతుకుతుంటారు. బ్రిటీష్, నైజాం పాలన ముగిసిన తర్వాత హైదరాబాద్‌లో ప్యారడైజ్ ప్రాంతాన్ని సంపన్న వర్గానికి చెందిన శిఖంజి మాలిక్ (మోహన్ బాబు) కుటుంబీకులు పాలిస్తుంటారు. ఆ ప్రాంతాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకొని అక్కడి ప్రజలను శాసిస్తుంటారు. అదే ప్రాంతంలో ఎన్నో ఏళ్ల క్రితం వలస వచ్చిన సవారీ తెగ వాళ్లు తమ గుర్తింపు, పౌరసత్వం కోసం సమ్మక్క (సోనాలి కులకర్ణి) నాయకత్వంలో పోరాటం చేస్తుంటారు. ఈ పోరాటంలోనే సమ్మక్క జడల్ (నాని)కి జన్మనిస్తుంది. తన కొడుకును కంటికి రెప్పలా చూసుకొన్నప్పటికీ.. ఓ కారణంగా తల్లి సమ్మక్క అంటే ద్వేషాన్ని పెంచుకొంటాడు. చిన్నతనంలోనే మాలిక్ కుటుంబాన్ని ఎదురించి జడల్ జైలుకు వెళ్తాడు. ప్యారడైజ్ ప్రాంతంలో శిఖంజి మాలిక్ కుటుంబీకుల ఆగడాలు ఎలా సాగాయి? ఆ ప్రాంత ప్రజలపై మాలిక్ వర్గం ఎలాంటి వేధింపులకు గురైంది? సమ్మక్క ఉద్యమంపై మాలిక్ వర్గం ఎలా ఉక్కుపాదం మోపింది? జడల్ పుట్టుక ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది? తన కొడుకుకు జడల్ జమానా అని పేరు ఎందుకు పెట్టారు? తల్లిపై జడల్ ఎందుకు ద్వేషం పెంచుకొన్నాడు? మాలిక్‌ పతనం చూడాలని జడల్ ఎందుకు నిర్ణయించుకొన్నాడు? సుబ్లలక్ష్మీ అలియాస్ సుబ్బు (కాయదు లోహర్)తో లవ్ ట్రాక్ ఎలా సాగింది? తల్లితో జడల్ కలిశాడా? మాలిక్ పతనానికి జడల్ ఎలాంటి వ్యూహం పన్నాడు? ప్యారడైజ్‌లో సవారీలకు గుర్తింపు లభించిందా? వారి పోరాటం ఎంతవరకు వచ్చింది? తల్లి గురించి నిజాలు తెలుసుకున్న జడల్‌.. ఆమె కోసం ఏం చేశాడు? తమ సవారిల గుర్తింపు కోసం ఎలాంటి తిరుగుబాటు చేశాడు? ఇంతకి తల్లి చేసిన తప్పేంటి? మాలిక్‌ జడల్‌ని ఎందుకు అవమానించాడు? బిర్యానీకి జడల్‌ అవమానానికి ఉన్న సంబంధం ఏంటి? ఇందులో కేసీఆర్, ఎన్టీఆర్‌ల పాత్రేంటి? చివరికి సవారీల తిరుగుబాటు, జడల్‌ పోరాటం ఫలించిందా లేదా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
విశ్లేషణ : కథానాయకుడి పుట్టుకకు సంబంధించిన సన్నివేశంతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ప్రారంభమైన కొద్దిసేపటి నుంచే ఇదేదో వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్లే కథ అనే ఫీలింగ్ తీసుకొచ్చాడు దర్శకుడు. ఒక ప్రత్యేకమైన సెటప్, ఎక్కడా నార్మల్ అనే ఫీలింగ్ రాకుండా ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి ప్రేక్షకులందరినీ తీసుకువెళ్లిపోయాడు. అసలు ఆ ప్రదేశం ఏంటి, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అక్కడ ప్రజల పరిస్థితులు, వారిపై పెత్తనం చేసేవారి ఆఘాయిత్యాలు అంటూ కొద్దిసేపట్లోనే సినిమా అవుట్‌లైన్ ఏంటో చూపించేశాడు. సవారీల నేపథ్యాన్ని పరిచయం చేసే సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. తొలి ఫ్రేమ్ నుంచే కథలోకి తీసుకెళుతుంది. జైల్ ఫైట్‌లోనే… హీరో చిన్ననాటి నేపథ్యాన్ని చూపిస్తూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. జడలు, పచ్చబొట్టు వెనక కథని వివరించే సన్నివేశాలు ప్రథమార్ధానికి ప్రధాన ఆకర్షణ. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రాసుకొన్న కథను సింగిల్ పాయింట్‌గా చూస్తే ఫుల్ ఎమోషనల్‌గా అనిపిస్తుంది. కానీ ఆ పాయింట్‌ను కథగా విస్తరించి సన్నివేశాలు మలచే క్రమంలో దర్శకుడి నేర్పు కనిపిస్తుంది. ఒకప్పుడు తెలంగాణ యాసను సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలకు, కామెడీ పాత్రలకు, పల్లెటూరి వెనుకబాటుతనానికి ప్రతీకగా చూపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ మనిషి మాట్లాడే మాటను హేళనగా చూపించిన రోజులు కూడా మనం చూశాం. కానీ ఇప్పుడు కాలం మారింది. తెలంగాణ మారింది. తెలంగాణ బిడ్డల ప్రతిభ ప్రపంచం ముందు కనిపిస్తోంది. ఇప్పుడు అదే తెలంగాణ యాస హీరోల నోట వినిపిస్తోంది… కథలకు ప్రాణం పోస్తోంది, ప్రపంచ ప్రేక్షకుల ముందుకు గర్వంగా వెళ్తోంది. ఆ మార్పులో తనదైన ముద్ర వేస్తున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాలో ఓ సందర్భంలో కేఫ్‌లో వచ్చే ఫైట్ సీన్, అలాగే ఇంటర్వెల్ సీన్స్ సినిమాలో బాగా వర్కవుట్ అయ్యాయి. నాని తన పాత్ర కోసం పడ్డ శ్రమ, శారీరక మార్పులు స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ సీక్వెన్సెస్. మేకర్స్ ఖర్చుకు వెనకాడకుండా ప్రతి యాక్షన్ బ్లాక్‌ను అత్యంత భారీ స్థాయిలో డిజైన్ చేశారు. మాస్ సీన్లలో ఆయన నటన, ఫైట్స్‌లో చూపించిన ఈజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. జడల్ అనే పాత్రను అద్భుతంగా క్రియేట్ చేయడం.. షికాంజా మాలిక్ ను డిజైన్ చేసుకోవడం.. విలనిజం, హీరోయిజంకు సంబంధించిన సీన్లను అద్భుతంగా రాసుకుని తెరకెక్కించడంలో శ్రీకాంత్ ఓదెల్ పూర్తి సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ ఫైట్ సీన్ ను అద్భుతంగా తెరకెక్కించాడు. సుబ్బలక్ష్మీగా కాయదు లోహర్ ఎంట్రీతో సినిమా చిన్న కుదుకులోనవ్వడమే కాకుండా అప్పటి వరకు ఉన్న మంచి ఎమోషన్స్ డైల్యూట్ చేసేలా చేస్తుంది. కానీ ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాను మరోసారి మంచి రేంజ్‌కు తీసుకెళ్లేలా చేసింది. ఇలాంటి వ్యవహారాలతో ది ప్యారడైజ్ సినిమా ఫస్టాఫ్ మంచి పీల్, ఎమోషన్స్‌తో ముగుస్తుంది. సెకండాఫ్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఏం చెప్పబోతున్నాడనే క్యూరియాసిటీని కలిగించాడు. సెకండాఫ్‌లో ప్రెగ్నెంట్ ఉమెన్ సీన్‌ను హైలీ ఎమోషన్స్‌తో తెరకెక్కించి మరోసారి కథపై పట్టు బిగించాడనే ఫీలింగ్ కలిగిస్తాడు. నాని ‘హిట్ 3’ సినిమాతోనే వైలెన్స్‌ని ఒక రేంజ్‌లో చూపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఫ్యామిలీ హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ సంపాదించుకున్న నాని, ఇమేజ్ మేకోవర్ కోసమో లేక భిన్నమైన సినిమాలు చేయాలనే ఉద్దేశంతోనో, కాస్త యాక్షన్ అలాగే వైలెన్స్ పాలు ఎక్కువగా ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే ‘ది పారడైజ్’ అనౌన్స్ చేసినప్పుడే మంచి బజ్ ఏర్పడింది. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ అంతా రక్తపాతం చూసి, ఇది కూడా ఇంకేదో సృష్టించబోతోంది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. సినిమాకి బజ్ కూడా అదే రేంజ్‌లో ఉంది. నాని ఇంట్రడక్షన్.. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ మంచి హై ఇస్తాయి. సెకండాఫ్ లో మోహన్ బాబు వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఫస్టాఫ్ ఒకరకంగా గూస్‌బంప్స్ తెప్పించేలా సాగుతుంది. ఒకపక్క అనిరుధ్ మ్యూజిక్, మరొకపక్క శ్రీకాంత్ ఓదెల టేకింగ్‌తో పాటు, నాని పీక్ పెర్ఫార్మెన్స్‌తో ఇంటర్వెల్ బ్లాక్ వరకు సినిమా ఒక అద్భుతమైన ఫీల్ ఇస్తుంది. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ మూమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ నేత కెసీఆర్ ని ఇన్‌స్పిరేషన్‌గా చేసుకుని రాసుకున్న క్యారెక్టర్ చూసినప్పుడు ప్రేక్షకులలో మంచి ఫీల్ కలిగించేలా దర్శకుడు రాసుకున్నాడు. ప్యారడైజ్ కథ కొత్తదేమీ కాదు. గుర్తింపు కోసం పోరాడే ఓ గుంపు, సమూహం చేసే పోరాటాన్ని ఇది వరకు ఎన్నో చిత్రాల్లో చూసే ఉంటాం. అందరినీ గుప్పిట్లో పెట్టుకునే ఓ క్రూరుడు.. వాడి కింద నలిగే ఓ సమూహం.. అందులోంచి పుట్టుకొచ్చే నాయకుడు.. చివరకు ఆ నాయకుడు ఆ సమూహానికి స్వాతంత్ర్యం ఇప్పించడం.. సమాజంలో గుర్తింపుని ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్‌గా చెప్పుకుంటే ప్యారడైజ్ కథ ఇదే. కానీ ఇంత సింపుల్‌గా తీస్తే అతను శ్రీకాంత్ ఓదెల ఎందుకు అవుతాడు? అన్న ప్రశ్న వస్తుంది. నిజమే ఇలాంటి కథకు.. జడల్ అని పాత్రను క్రియేట్ చేయడం.. షికాంజ మాలిక్‌ని డిజైన్ చేసుకోడం.. విలనిజం, హీరోయిజంకి సంబంధించిన సీన్లను అద్భుతంగా రాసుకుని.. మరి అద్భుతంగా తెరకెక్కించడంలో శ్రీకాంత్ ఓదెల సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అదే ఈ సినిమాకి ప్రధానంగా కలిసి వచ్చే అంశం. ఇక ఇందులో శ్రీకాంత్ తన మెగా అభిమానాన్ని చాలా సీన్లలో చూపించాడు. నాని సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో రక్తపాతంతో పాటు ఫౌల్ లాంగ్వేజ్ కూడా కాస్త ఎక్కువే. సెన్సార్ కట్స్ ఉన్నా, కొన్నిచోట్ల అక్కడేం మాట్లాడుతున్నారనే విషయం అర్థమవుతుంది. ప్రారంభంలో శికంజి మాలిక్‌ పాత్రల పరిచయం, వారి నేపథ్యం, అలాగే సవారీలు వలస రావడం, ఎన్నో ఏళ్లుగా బానిసలుగానే ఉండటమనే ఎలిమెంట్లని పరిచయం చేసిన తీరు బాగుంది. అది మూవీపై ఆసక్తిని పెంచింది. సవారీల పోరాటం, వారి స్ట్రగుల్స్, జడల్‌ పాత్ర పుట్టక వరకు ఎమోషనల్‌గా ఉంటుంది. సినిమా ఓ వైపు తమ గుర్తింపు కోసం సవారీలు చేసే తిరుగుబాటు చుట్టూ, మరోవైపు తల్లికొడుకుల మధ్య బాండింగ్‌ చుట్టూ తిరుగుతుంది. దీనికి మించిన యాక్షన్‌ ప్రధానంగా నడుస్తుంది. అందులోనే లవ్‌ ట్రాక్‌ కూడా ఉంటుంది. మరోవైపు రియల్‌ రాజకీయాలకు సంబంధించిన ఎలిమెంట్లు ఉన్నాయి. సుబ్బుతో లవ్‌ ట్రాక్‌ .. చుక్క చిత్రాలతో హీరోయిన్‌ చేసే రచ్చ అదిరిపోయింది. గ్లామర్ ట్రీట్‌ అని చెప్పొచ్చు. ఆ తర్వాత కథ రకరకాలుగా తిరుగుతుంది. తల్లీ, కొడుకుల ఎమోషన్స్ ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్‌కి ముందు ఎపిసోడ్‌ ఆసక్తికరంగా ఉంటుంది. సెకండాఫ్‌లో మాలిక్‌తో జడల్‌ పోరాటం చూపించారు. అది యాక్షన్‌కే పరిమితం చేశారు. ఆ తర్వాత కథ మరోలా టర్న్ తీసుకుంటుంది. కొత్త పాత్రల ఎంట్రీ ఉంటుంది. సెకండాఫ్ లో ఎమ్మెల్యే శంకర్‌రావుగా ప్రియ‌ద‌ర్శి క్యారెక్ట‌ర్ ఆడియెన్స్‌లో జోష్ నింపుతుంది. కేసీఆర్ త‌ల‌పించే పాత్ర‌లో అత‌డి చెప్పిన‌ డైలాగ్స్‌కు థియేటర్స్‌లో ఈలలు వేయిస్తుంది. ఈ పాత్ర హిలేరియస్‌గా ఉంటుంది. ఎన్టీఆర్‌ ని పాజిటివ్‌గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కనిపించింది. తరాలు మారినా.. యుగాలు దాటినా.. తగ్గదు నటసార్వభౌముడి ప్రభంజనం తెలుగు సినీ చరిత్రలో ఆయనొక యుగం.. ఆయన శకం ఎప్పటికీ శాశ్వతం! కథలోని ప్రపంచాన్ని, పాత్రలను, అక్కడి పరిస్థితులను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నిర్మించిన విధానం బాగుంది. ‘ధురంధర్‌’ తరహాలో ఈ సినిమాను చాప్టర్లుగా విభజిస్తూ కథనాన్ని ముందుకు నడిపాడు. మొత్తం 6 చాప్టర్లు ఉంటాయి. అందులో మొదటి చాప్టర్‌లో సవారీ జాతి నేపథ్యాన్ని, అణచివేతకు గురైన తీరుని చూపించారు. ఇది ఆసక్తికరంగానే సాగుతుంది. ఇక రెండో చాప్టర్‌లో హీరోయిన్‌ ఎంట్రీ ఉంటుంది. ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అయితే ఆమె తండ్రిపై ప్రేమలో చేసే ఒక పని.. లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. ఎమోషనల్‌గానూ అంతగా ఆకట్టుకోలేదు. చాప్టర్‌ 3లో మదర్‌ సెంటిమెంట్‌ని చూపించారు. ఒకవైపు కథను ఎమోషనల్‌గా నడిపిస్తూనే మరోవైపు శృతిమించిన వయెలెన్స్‌ని చూపించారు. సినిమాలో మెయిన్‌గా యాక్షన్‌ సీన్లు బాగున్నాయి. తల్లి కొడుకుల మధ్య ఎమోషన్‌ మెప్పించింది. కాకి, జడల్‌కి ఉన్న సంబంధం ఫర్వాలేదు. అమ్మోరు ఆవహించినట్టు వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్ అదిరిపోయింది. బీజీఎం సినిమాకి ప్లస్‌, అనిరుధ్‌ దుమ్ములేపారు. కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్ లు మాస్‌ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పిస్తాయి. హీరోయిన్‌ పాత్ర చేసే సినిమాలకు సంబంధించిన సీన్లు హిలేరియస్‌గా ఉంటాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదిరిపోయింది. చాప్టర్‌ల వైజ్‌గా ఈ కథను విడగొట్టి శ్రీకాంత్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంట్రడక్షన్‌లో భాగంగా పెట్టిన జైల్ ఫైట్‌ని చూస్తేనే ఇదేదో క్లైమాక్స్ ఫైట్‌లా ఉందే అనిపిస్తుంది. ఇందులో హీరోయిన్ ట్రాక్ కాస్త డీవియేషన్‌లా అనిపిస్తుంది. మళ్లీ విక్రమ్ మాలిక్ పాత్ర ఎంట్రీ.. హీరో, విలన్ తలపడే సీన్స్.. ఇంటర్వెల్ బ్లాక్ ఇలా అంతా కూడా పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్ ఫైట్ అయితే నెక్ట్స్ లెవెల్ అనిపిస్తుంది. సెకండాఫ్ ఎలా ఉంటుందో అని ఊహిస్తూ ప్రారంభించే ప్రేక్షకుడికి మోహన్ బాబు రూపంలో సర్ ప్రైజ్ ఇప్పించేస్తాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. అక్కడ ఐదారు నిమిషాలు మోహన్ బాబు విశ్వరూపం, క్రూరత్వం చూపిస్తాడు. ఆ తర్వాత మళ్లీ కథ కాస్త డీలా పడిపోయినట్టు అనిపిస్తుంది. మళ్లీ హీరో కమ్ బ్యాక్ ఇచ్చి.. మాలిక్ ఇంట్లో సృష్టించే విధ్వంసం, పూనకం వచ్చినట్టు ఊగుతూ చేసిన రక్తపాతం ఓ రేంజ్‌లో ఉంటుంది. అక్కడి వరకు సినిమా అద్భుతంగా అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు, తమని తామనే స్వతంత్రులుగా ప్రకటించుకోవడం, తుపాకీలు పెట్టి బెదిరించి విద్య, వైద్యాన్ని తమ వద్దకు తెచ్చుకునే ఈ సీన్లన్నీ సాగుతూ వెళ్తుంటాయి. కథ, కథనాల్ని పక్కనపెట్టి థియేట్రికల్ అనుభూతిని పంచే అంశాలకు పెద్దపీట వేస్తూ మలిచిన సినిమా ఇది. ‘ఈ జీవితమంతా పోరాటానిది, వచ్చే జన్మ మనది’ అంటూ తమ జాతి గుర్తింపుకోసమే బతుకుల్ని పణంగా పెట్టిన తల్లీ కొడుకుల కథ ఇది. దృశ్యం, సంగీతం పరంగా తిరుగులేని ప్రభావం చూపిస్తుంది. సవారీల అట్టడుగు జీవితాలకు అద్దం పడుతూ, ప్యారడైజ్ ప్రపంచంలో లీనం చేస్తుంది. ప్రతీ ఫ్రేమ్ ఓ పెయింటింగ్‌లా తెరపై కనిపిస్తుంటుంది. అందుకు దీటుగా అనిరుధ్ పాటలు, నేపథ్య సంగీతం ఉంటాయి. మరోవైపు ఇన్నాళ్లూ నేచురల్ స్టార్‌గా కనిపించి అలరించిన నాని… ఇందులో ‘షేర్ నాని’గా విజృంభణ చేస్తాడు.. జడలు మెలిపెట్టి వీరోచిత విన్యాసాలు చేస్తాడు.. గన్స్‌ పేలుస్తాడు.. పదునెక్కిన కత్తులతో రక్తం ఏరులై పారిస్తాడు.. అడుగడుగునా తలలు గాల్లో ఎగిరి పడుతుంటాయి. మొండేలు అడ్డంగా తెగిపడుతుంటాయి. హై మూమెంట్స్‌తో కూడిన ఈ హంగామా థియేటర్లలో ఈలలు వేయిస్తుంది. పతాక సన్నివేశాలు.. ముఖ్యమంత్రి వచ్చే సన్నివేశాలూ ఆకట్టుకుంటాయి. కథకు రియల్ టైమ్ అంశాలతో ముడిపెడుతూ తీర్చిదిద్దిన ఆ సన్నివేశాలే సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఎమ్మెల్యే శంకర్ (ప్రియదర్శి) అంటూ కేసీఆర్‌ను పోలిన పాత్ర రాకతో మళ్లీ తెరపై సందడి మొదలవుతుంది. కేసీఆర్ ప్రసంగాల్ని పోలిన సంభాషణలు, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో మోహన్‌బాబు పాత్రని పరిచయం చేసిన తీరు ఎంతో బాగుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలతో సినిమా గాడిన పడుతుంది. తల్లీకొడుకులతో ముడిపడిన ఆ సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తిని రేకెత్తిస్తాయి. జడల్ కోరుకున్నట్టుగా శిఖంజా మాలిక్ బయటకు వస్తుండడంతో తదుపరి ఇద్దరి మధ్య ఏం జరుగుతుందా? అనే కుతూహలం పెరుగుతుంది. క్లైమాక్స్‌లో మాత్రం గూస్ బంప్స్ మూమెంట్స్ లెక్కలేనన్ని ఉంటాయి. అప్పుడే పుట్టిన చిన్న పాప చుట్టూ రాసుకున్న ఎమోషన్స్, తీసిన యాక్షన్ సీక్వెన్స్, అప్పుడు అనిరుధ్ ఇచ్చే బీజీఎం, అక్కడ వచ్చే ఆయా షేర్ పాట రోమాల్ని నిక్కబొడిచేలా చేస్తుంది. చివరకు మదర్ సెంటిమెంట్‌తో ఆడియెన్స్ ఏడ్పించేస్తాడు. స‌వారీ ప్ర‌జ‌ల‌కు గుర్తింపు తీసుకురావాల‌నే త‌ల్లి క‌ల‌ను ఓ కొడుకు ఎలా నెర‌వేర్చాడు అనే పాయింట్‌తో డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల ఈ క‌థ‌ను రాసుకున్నారు. అందులోనూ నాని లాంటి సాఫ్ట్ హీరోతో ఇలాంటి మాస్ క‌థ‌ను చేయాల‌ని అనుకోవ‌డం ఒక ర‌కంగా సాహ‌స‌మ‌నే చెప్పాలి. ఈ రిస్క్‌లో స‌క్సెస్ అయ్యాడు డైరెక్ట‌ర్‌. ఆరంభ స‌న్నివేశాల‌తో ప్యార‌డైజ్ ప్ర‌పంచంలోకి బాగానే తీసుకెళ్లాడు డైరెక్ట‌ర్‌. హీరో చేతిపై ఓ ప‌చ్చ‌బొట్టు…త‌ల్లి గురించి ఓ క‌ఠిన నిజం… వాటి ద్వారా ప‌గతో అత‌డు ర‌గిలిపోయిన‌ట్లుగా చూపిస్తూ అస‌లైన క‌థ‌లోకి ఫాస్ట్‌గానే ఎంట‌ర‌య్యాడు. ఇంట‌ర్వెల్ ఫైట్‌ సీక్వెన్స్‌తో సెకండాఫ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూసేలా చేశాడు డైరెక్ట‌ర్‌. నానిపై మోహ‌న్‌బాబు ఎటాక్ చేసే సీన్‌, త‌న వారిని కాపాడుకోవ‌డం హీరో ఫైట్ చేసే సీన్లు బాగున్నాయి. విల‌న్‌ను దెబ్బ‌కొట్ట‌డం కోసం హీరో వేసే ఎత్తుల్లో థ్రిల్లింగ్ ఫ్యాక్స‌ర్ కనిపిస్తుంది. చిన్నారిని కాపాడ‌టం కోసం ప్యార‌డైజ్‌లోని ప్ర‌జ‌లంతా క‌లిసి చేసే ఫైట్‌తో క్లైమాక్స్‌ను బాగా డిజైన్ చేసుకున్నారు. ఆయా షేర్, ఏష నాగుల పాటలు అయితే సింగిల్ స్క్రీన్స్‌ని అల్లాడించేస్తాయి. ‘అమ్మలా చూసుకుంటావ్ అనుకున్నా.. కానీ అమ్మలా అవుతావ్ అని అనుకోలేదు.. ఈ జన్మ పోరాటానిది.. వచ్చే జన్మ మనది’ అంటూ శ్రీకాంత్ రాసిన డైలాగ్స్ చాలా వరకు మనసుల్ని తాకుతాయి. ప్యారడైజ్ సెట్ ఎంతో నేచురల్‌గా అనిపిస్తుంది. క్యాస్టూమ్స్ అప్పటి కాలానికి తీసుకు వెళ్తాయి. నాని పెర్ఫార్మెన్స్‌లో మాస్ ఎలివేషన్స్ అభిమానులను అలరించేలా ఉన్నాయి. నాని తన పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్‌తో ఆకట్టుకోగా.. యాక్షన్ సన్నివేశాలు, శ్రీకాంత్ ఓదెల టేకింగ్, గ్రాండ్ విజువల్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. కథను దర్శకుడు తనదైన స్టైల్‌లో ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదిగా అనిపించినా.. యాక్షన్, నాని నటన, టెక్నికల్ అంశాలు ఆ లోటును భర్తీ చేస్తాయి. సినిమా చూస్తున్నంతసేపు ‘తెలుగు సినిమాకు ఒక కొత్త మాస్ డైరెక్టర్’ దొరికేశాడు అనిపిస్తుంది. కొన్ని సీన్స్‌ను చాలా బాగా తీశాడు. ప్రతి సీన్‌కి డీటెయిలింగ్ ఇచ్చిన విధానం చూస్తే డైరెక్టర్‌కి డీటెయిలింగ్‌పై ఎంత ఫోకస్ ఉందో అర్థమవుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే దద్దరిల్లి పోతుంది. సినిమా ప్రారంభంలో దివంగత ప్రముఖులు కోట శ్రీనివాసరావు, రామోజీరావులతో పాటు ‘ఆయే షేర్’ సాంగ్ ట్రెండింగ్‌కు కారణమైన కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్‌కు చిత్రబృందం ప్రత్యేక నివాళులర్పించింది. ఇక గద్దరన్నకు కూడా ఆయన పాడిన పాట క్లిప్‌తో స్మరించుకున్నారు. అలాగే కథలో భాగంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పోలిన పాత్రలో ప్రియదర్శి, ఎన్టీఆర్ లుక్‌లో విజయ్ కుమార్‌ క్యామియో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ది ప్యారడైజ్.. ప్రతి పాటలోనూ తెలంగాణ గుండె చప్పుడు, ప్రతి మాటలోనూ తెలంగాణ యాసల తీపి, ప్రతి పదంలోనూ తెలంగాణ భాషల ధ్వని, ప్రతి దృశ్యంలోనూ తెలంగాణ బతుకు చిత్రం. అన్యాయం మీద తిరుగుబాటు, హక్కుల కోసం పోరు.. ఇది కేవలం సినిమా కాదు.. తెలంగాణ ఆత్మ కథ. ప్రతి పాట వినిపిస్తే గుండెలు కదులుతాయి. ప్రతి మాట వినిపిస్తే కళ్ళు తడుస్తాయి. ప్రతి పదం వినిపిస్తే రక్తం సలసలా మరుగుతుంది. ఇది తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ వీరత్వం.. ఓదెల సృష్టి, నాని అవతారం..జడల్ రూపంలో మెరిసిన తెలంగాణం ‘ది ప్యారడైజ్’. సినిమా అంటే కల్పన…అభూత కల్పన ఎంత అద్భుతంగా ఉన్నా అది కల్పనే! అది అందమైన అబద్దమే. కానీ తెలంగాణ కథ వేరు. ఇది ఊహాజనిత కథ కాదు…సజీవ చరిత్ర. చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లోని పేజీలు కాదు… ప్రజల బతుకు. ప్రజల బాధ. ప్రజల పోరాటం. ప్రజల త్యాగం. అందుకే తెలంగాణ కథను తెరపై చూపిస్తే అది కేవలం సినిమా కాదు… తరతరాలుగా బతికిన చరిత్రకు దృశ్యరూపం! అదే తెలంగాణ సినిమా. అదే తెలంగాణ మట్టి కథ. ఈ సినిమాలో బాగా ప్రజాదరణ పొందిన ‘ఏష నాగుల’ పాటకు ముందు కేసీఆర్ సీన్ వచ్చింది. ఆ సన్నివేశం తర్వాత ‘హే జిమ్మేదరి పటేలో.. జిమ్మేదారి పటేలో.. గల్మకాడ నీ కోసం ముగ్గునైతిరో.. జిమ్మేదరి పటేలో.. జిమ్మేదారి పటేలో.. నీ తొవ్వల నా చూపులు కావలున్నయో.. అర్రల గుడ్డిదీపమయ్యిందిర పానం..ఒర్రిన ఇంటలేదు.. ఏందీ పాపం” చూస్తుంటే థియేటర్ దద్ధరిల్లి పోయింది. నాని ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిని రేపిన తెలుగు సినిమాల్లో ఒకటిగా మారింది ఈ సినిమా. తెలంగాణ మాటలో నేల వాసన ఉంది. పల్లె జీవితం ఉంది. బతుకమ్మ పాట ఉంది. జానపద గీతం ఉంది. బతుకుబండి నడిపిన కష్టం ఉంది. పోరాటం ఉంది. ప్రేమ ఉంది. చమత్కారం ఉంది. తెగింపు ఉంది. ముఖ్యంగా మనిషితనం ఉంది. తెలంగాణ భాష, సంస్కృతి, ప్రజల జీవన విధానం ఇవన్నీ మన అస్తిత్వంలో భాగమే. తెలంగాణ యాసను వెండితెరపై ఆవిష్కరించిన తెలంగాణ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆయన తెలంగాణ యాసను కేవలం డైలాగ్ కోసం ఉపయోగించలేదు. యాసను పాత్రగా మార్చాడు. యాసను కథలో భాగం చేశాడు. యాసకు భావోద్వేగం ఇచ్చాడు. యాసకు గౌరవం తీసుకొచ్చాడు. అతని ప్రయాణం ఒక్క సినిమాతో ఆగిపోలేదు. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ వంటి పాన్-ఇండియా స్థాయి చిత్రంతో మరోసారి తన కథ చెప్పే శైలిని పెద్ద ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. విజయం సాధించాడు.
నటీనటుల పనితీరు: హీరో నాని తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఉండే పాత్రలో ఒదిగిపోయి.. కథను తన భుజానికి ఎత్తుకొని నడిపించాడు. ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నించే నాని మరోసారి తన శక్తికి మించిన ప్రయత్నమే చేశాడనిపిస్తుంది. దర్శకుడు శ్రీకాంత్ ఎలా చెబితే అలా చేశాడనే విషయం పలు సీన్లు చూసిన తర్వాత క్లారిటీ లభిస్తుంది. పలు సీన్లలో నాని నటన బ్రహ్మండంగా ఉంటుంది. ఈ సినిమా నాని వన్ మ్యాన్ షో. ఇప్పటివరకు హోమ్లీ క్యారెక్టర్స్‌లోనే అతన్ని చూసిన ఆడియన్స్, ఒక పూర్తిస్థాయి వైలెంట్ క్యారెక్టర్‌లో చూడటం కాస్త భిన్నంగానే అనిపించినా, చాలా ఈజ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన చేసిన ఫైట్లు, డ్యాన్సులు బాగా వర్కౌట్ అయ్యాయి. జడల్‌ పాత్రలో పాత్రలోనూ జీవించి విశ్వరూపం చూపించారు. ఆయన మూవీకోసం ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టం మొత్తం సినిమాలో కనిపిస్తుంది. ఎమోషనల్‌ సీన్లలో సెటిల్డ్ గా చేసి ఆకట్టుకున్నాడు. హవభావాలతోనే నటించాడు. డాన్స్‌ లతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ లో అయితే రెచ్చిపోయాడు. నాని నుంచి ఇదొక కెరీర్‌ బెస్ట్ పర్‌ఫెర్మెన్స్ గా చెప్పొచ్చు. షేర్ నాని అంటూ తనలోని అసలు సిసలు యాక్షన్ అవతారాన్ని చూపించారు. చాలా సన్నివేశాల్లో చొక్కా విప్పేసి కనిపిస్తారు. ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా తనని తాను తీర్చిదిద్దుకున్న విధానం, ఆయన చేసిన పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నాని త‌న కెరీర్‌లో ల‌వ‌ర్‌బాయ్‌, ప‌క్కింటి కుర్రాడి లాంటి సాఫ్ట్ రోల్స్‌లోనే ఎక్కువ‌గా క‌నిపించాడు. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ రోల్‌లో అత‌డు చేసిన ఫ‌స్ట్ మూవీ ఇది. జ‌డ‌ల్ పాత్ర కోసం నాని ప‌డిన క‌ష్టం ప్ర‌తి ఫ్రేమ్‌లో క‌నిపిస్తుంది. అత‌డి లుక్‌తో పాటు అటిట్యూడ్‌, డైలాగ్ డెలివ‌రీ, మ్యాన‌రిజ‌మ్స్ డిఫ‌రెంట్‌గా ఉన్నాయి. ఇక మోహన్ బాబు ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. శికంజ మాలిక్ పాత్రలో తనదైన గాంభీర్యం, డైలాగ్ డెలివరీతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఎన్నో ఏళ్లుగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ఈ సినిమాలో మరోసారి పూర్తిగా కొత్త షేడ్స్‌లో కనిపించారు. ముఖ్యంగా ఆయన స్క్రీన్ మీద కనిపించే తీరు, డైలాగ్ డెలివరీ, ఆ గంభీరమైన ప్రెజెన్స్… ఇవన్నీ కలిసి ఈ పాత్రను మరింత ప్రత్యేకంగా మార్చాయి. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమాకు ప్లస్‌ అయింది. చాలా కాలం తర్వాత మోహన్‌ బాబు ఇలాంటి పాత్రలో కనిపించి మెప్పించాడు. శిఖంజీగా తన మార్కు నటనను ప్రదర్శించారు. చాలా రోజుల తర్వాత మళ్లీ నెగిటివ్ క్యారెక్టర్‌లో చెలరేగిపోయారు. మోహన్ బాబు పాత్ర స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా, కనిపించిన ప్రతిసారీ తనదైన డామినేషన్ కనబరిచారు. గతంలో ఎప్పుడూ చూడని వైవిధ్యమైన పాత్రలో చూడొచ్చు. విలన్‌గా అదరగొట్టాడు కలెక్షన్‌ కింగ్‌. ఆ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక శికంజ మాలిక్‌ కొడుకుగా బాలీవుడ్ న‌టుడు రాఘవ్ జుయల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఉన్నంతసేపు ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు అతడి పాత్ర చిన్నదే అయినా డిజైన్ చేసిన తీరు బావుంది. ఇక హీరో తల్లి సమ్మక్కగా సోనాలి కులకర్ణి తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమాకు కీలకమైన పాత్రలో జీవించింది. నానితో ఆమె కాంబినేష‌న్‌లో వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్లు ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. సుబ్బు పాత్రలో హీరోయిన్ కయాదు లోహర్ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. పాత్ర నిడివి తక్కువే అయినా గుర్తిండిపోయే పాత్ర చేసింది. పాత్ర పరిమితమే అయినా, కీలకం కావడంతో ఉన్నంతలో ఆకట్టుకుంది. ఈశ్వరీరావు పాత్ర సైతం బాగుంది. సత్యరాజ్‌ పాత్ర ఓకే అనిపిస్తుంది. బిర్యానీ అనే పాత్రలో సంపూర్ణేష్ బాబు పూర్తిస్థాయి సీరియస్ పాత్రలో మెప్పించాడు. అతడికి మంచి పాత్ర దక్కింది. తను కూడా బాగా చేశాడు. త‌నికెళ్ల‌భ‌ర‌ణితో పాటు మిగిలిన వాళ్ళు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఏష‌నాగుల పాటలో కీర్తి సురేష్ స్టెప్పులు మాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటాయి.
సాంకేతిక వర్గం : ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకి ఆర్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడా కామన్ లొకేషన్స్‌లో చేయకుండా ప్రతి సీన్ కూడా సెట్‌లోనే చేయాల్సి రావడం ఛాలెంజింగ్ టాస్క్. ఆ విషయంలో ఆర్ట్ టీమ్ కష్టాన్ని మెచ్చుకోవలసిందే. ఆర్ట్ వర్క్, సీహెచ్ సాయి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్యారడైజ్ వరల్డ్‌ను అద్బుతంగా క్రియేట్ చేశాడు. సీహెచ్‌ సాయి విజువల్స్ బాగున్నాయి. కొత్తగా ఉన్నాయి. కనువిందుగానూ ఉన్నాయి. స్లమ్ కమ్యూనిటీని సినిమాటోగ్రాఫర్ బాగా సెట్ చేశారు. కలర్ టోన్, లొకేషన్స్, వర్షం జల్లుల సీన్ల క్లాసీగా పిక్చరైజ్ చేశారు. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ డైలాగ్స్‌ను సైతం డామినేట్ చేసేలా ఉండటం గమనార్హం. ఎలివేషన్ సీన్స్ విషయంలో అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది, కానీ కొన్నిచోట్ల డైలాగ్‌లను సైతం ఓవర్‌రైట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అనిరుధ్ పాటల విషయంలో అదరగొట్టాడు. తెరపై ‘ఆయా షేర్‌’, ‘ఏష నాగుల’ పాటలకు థియేటర్‌ ఊగిపోతుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి అనుసరించిన నిర్మాణ విలువలు బ్రహ్మండంగా ఉన్నాయి. ఈ సినిమా ఫుల్ రిచ్‌నెస్‌తో రూపొందించారు. ప్రొడక్షన్ డిజైనింగ్ విభాగానికి మాత్రం వందకు వంద మార్కులు పడతాయి. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన విజన్‌కు తగ్గట్టుగా సన్నివేశాల్ని రాజీపడకుండా తెరపై చూపించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా చాలా రిచ్‌గా ఉన్నాయి. మొత్తం మీద డిఫరెంట్ కంటెంట్, కొన్ని సర్‌ప్రైజెస్, యాక్షన్, ఎమోషన్స్‌ను ఎంజాయ్ చేయాలనుకొనే వారు ఈ ‘ది ప్యారడైజ్’ మాస్‌ యాక్షన్ థ్రిల్లర్‌ను చూడొచ్చు. కొన్ని సినిమాలు అద్భుతం.. అని చెప్పలేం కానీ చూస్తున్నంతసేపు ఎంగేజ్ చేస్తాయి. మంచి కాలక్షేపాన్ని ఇస్తాయి. ముఖ్యంగా చివరిదాకా చూసేలా చేస్తాయి. ఇదిగో ఈ సినిమా కూడా కొంచెం అటూ ఇటూలో అలాంటిదే. ఎంగేజ్ చేయటం పాటు యాక్షన్ ని , కామెడీని కూడా ఇచ్చింది. ఎన్నో సార్లు తెరపై వచ్చిన స్క్రీన్ ప్లేనే కొత్త సిట్యువేషన్స్, పాత్రలతో కొత్త అనిపించేలా ప్రయత్నించింది.