దటీజ్… ప్రియదర్శన్!

That's... Priyadarshan!
Spread the love

ఇలాంటి రికార్డ్ ప్రపంచంలోనే ఏ దర్శకుడికి వుండదు… వుండబోదు కూడా. 100 సినిమాలు తీసిన దర్శకులు చాలామందే వుంటారు. కె. రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు, కోడి రామక్రుష్ణ లాంటి వారు. అయితే తొలి సినిమా తీసిన హీరో తోనే 100 వ సినిమా తీసే చాన్స్ వచ్చింది మాత్రం ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కు మాత్రమే. 1984 లో ఆయన మోహన్ లాల్ హీరో గా ‘పూచక్కోరు మూక్కుతి ‘ అనే సినిమా తీశారు. ఇది ప్రియదర్శన్ తొలి సినిమా. ఈ నలభై రెండేళ్ళలో ఆయన అనేక భాషల్లో 99 సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు తన 100 వ సినిమాను, తన తొలి హీరో మోహన్ లాల్ తో తీస్తున్నట్టు ప్రకటించాడు. ఈ 42 ఇయర్స్ లో వాళ్ళిద్దరూ ఏమాత్రం అలసిపోకుండా, స్రుజనాత్మకతను కోల్పోకుండా తమ రంగాల్లో ప్రసిద్ధులు కావడం విశేషం. ఇలా ప్రపంచం లో ఏ దర్శకుడికైనా సాధ్యమవుతుందా? దటీజ్… ప్రియదర్శన్. అందుకే ఆయన 100 సినిమాల పర్ఫెక్ట్ దర్శకుడు అవుతున్నారు.

Related posts