గ్లామ‌ర‌స్ ఫోటోల‌తో సోష‌ల్‌మీడియాని షేక్ చేస్తున్న తెలుగ‌మ్మాయి కావ్య క‌ళ్యాణ్ రామ్‌

Telugu actress Kavya Kalyan Ram is shaking up social media with her glamorous photos.
Telugu actress Kavya Kalyan Ram is shaking up social media with her glamorous photos.
Spread the love

కావ్య క‌ళ్యాణ్ రామ్..ఈ పేరుకి కొత్తగా పరిచయం అవసరం లేదు….బాల న‌టిగా గంగోత్రి, ఠాగూర్‌, బాలు, బ‌న్ని వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌లో స్టార్‌ హీరోలంద‌రితో న‌టించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది..ఇక దిల్ రాజు బేన‌ర్‌లో వ‌చ్చిన మ‌సూద చిత్రంతో హీరోయిన్‌గా పరిచ‌య‌మైంది కావ్య కళ్యాణ్ రామ్‌. హీరోయిన్‌గా కూడా మొద‌టి సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్‌లో వ‌చ్చిన బ‌ల‌గం సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. బ‌లగం సినిమాలో కావ్య న‌ట‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కి మ‌రింత ద‌గ్గ‌ర చేసిందన‌డంలో ఎలాంటి సందేహం లేదు..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కావ్య, తన గ్లామర్ ఫోటోషూట్స్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ తెలుగు అమ్మ‌డు త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యాయి. రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌తో ఉన్న కావ్య ఫోటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
ఈ ఫోటోలో ఆమె క్యూట్ అండ్ గ్లామరస్ లుక్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక‌ పాజిటివ్ కామెంట్లతో ఆమెను మెచ్చుకుంటున్న అభిమానులు, ఆమెను త్వరలోనే మరిన్ని సినిమాలలో చూడాలని ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతం కావ్య క‌ళ్యాణ్ రామ్ రెండు ప్రాజెక్ట్స్‌తో మ‌న ముందుకు రానుంది. అతి త్వ‌ర‌లోనే వాటి విశేషాలను తెలుప‌నున్నారు మేక‌ర్స్‌..