జూన్‌ 14న హైటెక్స్‌ వేదికగా జరగనున్న తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుక

Telangana Gaddar Film Awards Ceremony to Be Held Grandly at Hitex on June 14
Telangana Gaddar Film Awards Ceremony to Be Held Grandly at Hitex on June 14
Spread the love

కొంత విరామం తరువాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది. తెలంగాణ గద్ధర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు వాటిలో నటించి ఉత్తమ ప్రతిభను చూపిన నటీనటులకు, సాంకేతిక నిపుణులతో పాటు 2014 జూన్‌ నుండి 2024 డిసెంబర్‌ 31 వరకు సెన్సారు జరుపుకున్న చిత్రాల్లో కూడా ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఇందులో భాగంగా అవార్డ్స్‌ ఇవ్వనున్నారు. ఇటీవల విజేతల జాబితాను కూడా ప్రటించారు. కాగా అపూర్వ వేడుక కోసం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. జూన్‌ 14న అంగరంగ వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. దాదాపు కొంత విరామం తరువాత ప్రభుత్వ అందిస్తున్న తెలంగాణ గద్దర్‌ అవార్డులు అందుకోవడం పట్ల అవార్డుల విజేతలు, తెలుగు సినిమా ప్రముఖులు, తెలుగు సినిమా ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రతిభను గుర్తించి తగు రీతిలో సత్కరించబోతున్న తెలంగాణ ప్రభుత్వం మీద ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ వేడుకను సీఎం రేవంత్‌ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటి రెడ్డి వెంకటరె్డి గారు, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు గారు, అత్యంత ఘనంగా జరిపించడానికి తగు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు తెలుగు తారాలోకమంతా తరలి రాబోతున్నారు. తప్పకుండా జూన్‌ 14న హైటెక్స్‌ వేడుక తారళ తళుకులతో ప్రకాశవంతం కాబోతుంది.