శ్రీసింహా కోడూరి ‘ఉస్తాద్’ షూటింగ్ పూర్తి… ఆగ‌స్ట్ 12న విడుద‌ల‌

'Ustaad’ starring Sri Simha Koduri, Kavya Kalyanram, Gautham Vasudev Menon and Anu Hasan entire shoot wrapped up

కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంటున్న యంగ్ హీరో శ్రీసింహా కోడూరి. ఆస్కార్ విన్నింగ్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి కొడుకు అయిన‌ప్పటినీ త‌న‌దైన రూట్‌ను ఏర్ప‌రుచుకుంటూ ముందుకు వెళుతున్నారు శ్రీసింహ‌. మత్తు వదలరా, భాగ్ సాలే వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ఈయ‌న ఆగ‌స్ట్ 12న ‘ఉస్తాద్‌’ చిత్రంతో మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. ‘ఉస్తాద్’ మూవీ అనౌన్స్‌మెంట్ రోజు నుంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీలో కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరోయిన్‌. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై ‘ఉస్తాద్‌’ చిత్రాన్ని ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌.. ‘రోజు..’ అనే సాంగ్‌కు…