డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ‘మ్యూజిక్ స్కూల్’ను ప్రేక్షకులు ఆదరించాలి : ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు షర్మన్ జోషి, శ్రియా శరణ్, షాన్, సుహాసిని మూలే, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతంసంగీత సారథ్యం వహిస్తోన్న మల్టీ లింగ్వువల్ మ్యూజికల్ మూవీ మే 12న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో మేకర్స్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా మ్యూజిక్ స్కూట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే శ్రియా శరన్ కొంత మంది పిల్లలతో కలిసి గోవా సముద్ర తీరంలో కారు డ్రైవింగ్ చేస్తూ…