– సంపూర్ణ న్యాయ సహకారం అందిస్తాం: సీనియర్ అడ్వకేట్ రామచందర్ రావు – కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం : వ్యవస్థాపక సభ్యుడు పీ వీ రమణారావు హైదరాబాద్/ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, జూలై 2 : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిజాంపేట్, పేట్ బషీరాబాద్ లోని 70 ఎకరాలు జేఎన్జే సొసైటీకే చెందుతుందని, ఈ భూమి కోసం సభ్యులందరూ డబ్బులు చెల్లించినందున ఆ భూమికి జేఎన్జే సొసైటీ సభ్యులే యజమానులని హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ స్పష్టం చేశారు. ఆదివారం టీమ్ జేఎన్జే ఆధ్వర్యంలో జరిగిన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదివారం ఉదయం పది గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫౌండర్ మెంబర్శ్రీ పీవీ రమణారావు అధ్యక్షతన…