”టీజర్ అదిరిపోయింది కదా.. దీనికి రెండు రెట్లు ట్రైలర్ వుంటుంది. ట్రైలర్ కి పదిరెట్లు సినిమా వుంటుంది. ప్రామిస్” అన్నారు నేచురల్ స్టార్ నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’ చిత్రం జూన్ 10న విడుదలకు సిద్ధమైయింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ జోరుగా ప్రొమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ రోజు టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. ‘అంటే సుందరానికి నాకు చాలా స్పెషల్ సినిమా. ఎందుకనేది .. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకే అర్ధమైపోతుంది. ఈ సినిమా కోసం చాలా మంచి టీమ్ పని చేసింది. చాలా రోజుల తర్వాత అంతా ఫ్యామిలీ మెంబర్స్ తో కలసి పని చేస్తున్నామనే ప్లజంట్…