జీ5…మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతూ అతి పెద్ద డిజిటల్ మాధ్యమంగా అవతరిస్తోంది. వైవిధ్యమైన కంటెంట్‌ను పలు భాషల్లో అందిస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న జీ 5 త్వరలోనే ‘మాయాబజార్ ఫర్ సేల్’ అనే సరికొత్త మల్టీస్టారర్ తెలుగు వెబ్ ఒరిజినల్‌ను అందించనుంది. వివిధ కథ, కథనాల ద్వారా సెటైరికల్ డ్రామాగా రూపొందుతోన్న మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్ గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతోంది. జీ 5తో పాటు రానా దగ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యానర్ కలిసి సునిశితమైన, హృద్యమైన డ్రామాగా మాయాబజార్ ఫర్ సేల్‌ను రూపొందిస్తున్నారు. ఇదొక గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్‌కు రైటర్, డైరెక్టర్‌గా గౌతమి చల్లగుల్ల…