ఆమె కట్టుకున్న చీర రేటు తెలిస్తే షాకవ్వాల్సిందే…!

If you know the price of the saree she has tied, you will be shocked...!

ఊర్వశి రౌతేలా ఇప్పుడు టాలీవుడ్‌ లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసే నటిగా బాగా పేరు తెచ్చుకుంది. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవి పక్కన ‘బాస్‌ పార్టీ’ డాన్సులు చేస్తూ అలరించింది. అలాగే యువ కథానాయకుడు అఖిల్‌ అక్కినేనితో ‘ఏజెంట్‌’ సినిమాలో కూడా ఒక స్పెష ల్‌ సాంగ్‌ లో నటించింది. ఆ తరువాత ‘బ్రో’ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ పక్కన, ‘స్కంద’ సినిమాలో రామ్‌ పోతినేనితో డాన్సులు చేసి ఊర్వశి తాను ఇలాంటి సాంగ్స్‌ కి స్పెషలిస్ట్‌ అనిపించుకుంది. ఊర్వశి ఈమధ్య వార్తల్లో కూడా వుంది. అహమ్మదాబాదులో జరిగిన ఇండియా, పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య జరిగిన వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ లో ఎంతో విలువైన, ఖరీదైన తన బంగారు ఫోనును పోగొట్టుకుంది. అదెవరికో దొరికింది కానీ ఇంకా అది ఊర్వశి చేతికి వచ్చిందో లేదో తెలియదు.…