తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఇందులో కొలువుదీరిన మంత్రి వర్గ కూర్పులోనూ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ కనిపించింది. మొత్తం పదకొండు మంది మంత్రులు కొత్త ప్రభుత్వంలో కొలువుదీరారు. అయితే ఇందులో మాత్రం మైనారిటీలకు చోటు లభించలేదు. కారణం… మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉండటం వల్లనే… ఇంకా మిగిలిన సామాజిక వర్గాలకు ఆయా సమీకరణాలను అనుసరించి మంత్రి పదవులు వరించనున్నాయని ఇప్పటికే సంకేతాలందాయి. దాంతో ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తోందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి స్వల్ప తేడాతే పరాజయం చెందిన మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ముస్లిం మైనారిటీ నాయకులు కోరుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా…