మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్’ వాల్తేరు వీరయ్య’- గ్రాండ్ గా జరిగిన 200 డేస్ షీల్డ్స్ ప్రజంటేషన్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’, మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించిన చిత్రం 2023 సంక్రాంతికి విడుదలై టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 200 రోజులను పూర్తి చేసుకుంది. ఇది చిరంజీవి, రవితేజలకు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటి. సినిమా 200 రోజుల రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ టీమ్ మొత్తానికి, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందించారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ పాల్గొన్న ఈ గ్రాండ్ ఈవెంట్ లో దర్శకులు హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు…