వెర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’. నిరంజన అనూప్, మణికందన్ ఆర్. ఆచారి ఇతర కీలక పాత్రలు పోషించారు. నారాయణ చెన్నా దర్శకత్వం వహించారు. బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ మూవీలో ప్రియదర్శి క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులని కట్టిపడేసింది. తనదైన నేచురల్ పెర్ఫామెన్స్, కామిక్ టైమింగ్ తో కథని ఆద్యంతం ఆకట్టుకునేలా నడిపారు ప్రియదర్శి. ఇప్పుడీ సినిమా భవానీ మీడియా ద్వారా ఆహ ఓటీటీలో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళం స్టార్ టోవినో థామస్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం నారదన్. అన్నా బెన్, షరాఫుద్దీన్, ఇంద్రన్స్, జాఫర్ ఇడుక్కి ఇతర కీలక పాత్రలు పోషించారు. నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రంలో న్యూస్…