ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీలీల ‘స్కంద’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘నీ చుట్టు చుట్టు’ పాట విడుదల

Ustad Ram Pothineni and Srileela's first single 'Nee Chuchu Chuchu' from 'Skanda' released

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ రామ్‌ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. మేకర్స్ ఇప్పుడు సినిమా మ్యూజికల్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఫస్ట్ సింగిల్ నీ చుట్టు చుట్టు పాట విడుదలైయింది. కంపోజర్ ఎస్ థమన్ మాస్ బీట్‌లతో చాలా రిథమిక్‌గా ఉండే క్రేజీ లిరిక్స్‌తో పెప్పీ, మాస్ ట్యూన్‌ని కంపోజ్ చేశారు. పాట మూడ్ టెంపోను ఎనర్జిటిక్ గా చేశారు. సిద్ శ్రీరామ్, సంజన కల్మంజే హుషారుగా పాడిన ఈ పాటకు రఘురామ్ రాసిన యూత్‌ఫుల్ లిరిక్స్‌ మరింత ఆకర్షణగా నిలిచాయి. రామ్ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. శ్రీలీల, రామ్‌ ఎనర్జీ ని మ్యాచ్…