Ugram Telugu Movie Review: ‘అల్లరి’ నరేష్ వన్ మ్యాన్ షో!

Ugram Telugu Movie Review: 'అల్లరి' నరేష్ వన్ మ్యాన్ షో!

(చిత్రం : ఉగ్రం, విడుదల : 5 మే-2023, రేటింగ్ : 3/5, నటీనటులు: ‘అల్లరి’ నరేష్, మిర్నా, శ్రీకాంత్ అయ్యంగార్, ఇంద్రజ, శత్రు తదితరులు. దర్శకత్వం : విజయ్ కనకమేడల, నిర్మాతలు: సాహు గారపాటి & హరీష్ పెద్ది, సంగీతం : శ్రీ చరణ్ పాకల, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జె, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్) టాలీవుడ్ లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకున్న నటుడు ‘అల్లరి’ నరేష్. అల్లరి నరేష్ చిత్రం అంటేనే హాయిగా నవ్వుకోవచ్చనే ధీమా ప్రేక్షకుల్లో ఉంటుంది. అదే ఉత్సాహంతో థియేటర్లలోకి అడుగుపెడతారు. అయితే గత కొంతకాలంగా అలాంటి ఈ కామెడీ హీరో తన రూటు మార్చి కొత్త పంథాలో.. అంటే కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గత చిత్రం ‘నాంది’తో అల్లరి…