షారూక్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘డంకీ’. భారీ అంచనాలతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ఎలా ఉంటుందోనిన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రేమ, స్నేహం వంటి భావోద్వేగ అంశాలతో రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్ క్యూరియాసిటీని పెంచుతోంది. ‘డంకీ డ్రాప్ 1’గా విడుదల చేసిన వీడియో, ‘డంకీ డ్రాప్ 2’గా విడుదల చేసిన ‘లుట్ పుట్ గయా..’ , ‘డంకీ డ్రాప్ 3’గా రిలీజైన ‘నికలే ది కబీ హమ్ ఘర్ సే’ పాటలు ప్రేక్షకుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. ఈ క్రమంలో ‘డంకీ డ్రాప్ 4’గా రాబోతున్న ట్రైలర్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకున్నాయి. ఈ ట్రైలర్‌ను మేకర్స్ డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నారు. ‘‘అందరూ…