రాజాకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు’. తెలుగులోనే కాదు ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎవరు చేయని విధంగా ఒకే షాట్లో సినిమా మొత్తాన్ని తెరకెక్కించి అందరిని ఆశ్చర్యశకితులను చేశాడు ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్, హీరో. అంతే కాకుండా ఇంతవరకు ఎవరు చేయలేని రీతిలో ట్రయిలర్ ను సైతం ఎంతో వినుత్నంగా, ఎంతో వైవిధ్యభరితంగా కట్ చేసి.. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఎంతో గ్రాండ్ గా జరిగిన ట్రయిలర్ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి విశేషాలు తెలుసుకుందాం. ఈ సందర్భంగా హీరో సూపర్ రాజా మాట్లాడారు. ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన మీడియా మిత్రులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తనకోసం మహబూబాబాద్, నెల్లూరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమాను తెరకెక్కించడమే…