నేచురల్ స్టార్ నాని సినిమాల్లో సాధారణంగా చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు ఉంటాయి. అదేవిధంగా, శౌర్యువ్ దర్శకత్వం వహించిన నాని పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ కూడా డిఫరెంట్ జోనర్ సాంగ్స్ ఆల్బమ్ తో అలరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బిట్స్ ఫిలాని క్యాంపస్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ఈ సినిమా మూడో సింగిల్ ‘అమ్మాడి’ పాటని లాంచ్ చేశారు. మృణాల్ ఠాకూర్ తన థర్డ్ యానివర్సరీని రివీల్ చేస్తూ తన పెర్ ఫార్మెన్స్ తో పాట ప్రారంభమవుతుంది. “ఇది నా భర్తకు అంకితం చేస్తున్న చాలా ప్రత్యేకమైన పాట. అతను ఎప్పటిలాగే ఆలస్యంగా వస్తున్నారు. పాట నా మాతృభాష తెలుగులో ఉంది’’ అంటూ మృణాల్ వాయిస్ తో పాట మొదలౌతుంది. ఈ పాట నాని,…