– మే 30, 2025 న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ‘కింగ్‌డమ్’ విడుదల యువ సంచలనం విజయ దేవరకొండ కథానాయకుడిగా ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంపై సినీ ప్రియులతో పాటు, సాధారణ ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ అనే శక్తివంతమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. టైటిల్ తో పాటు బుధవారం నాడు టీజర్ ను కూడా ఆవిష్కరించారు నిర్మాతలు. ‘కింగ్‌డమ్’ టీజర్ అద్భుతంగా ఉంది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే యాక్షన్ డ్రామాగా ‘కింగ్‌డమ్’ రూపొందుతోందని టీజర్ తో స్పష్టం చేశారు. ఈ ఇంటెన్స్ టీజర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ‘కింగ్‌డమ్’ టీజర్…