శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బాలుగాడి లవ్ స్టోరీ. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్ ఆకట్టుకోగా తాజాగా ఈ మూవీ నుంచి బేగంపేట లిరికల్ సాంగ్ వచ్చేసింది. కుర్రాకారును ఊపేసే బీట్‌తో ఈ పాట ఫుల్ స్వింగ్ లో సాగుతుంది. టాలీవుడ్ నటుడు స్టార్ కమెడియన్ పృథ్వీ రాజ్ చేతుల మీదుగా ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వేదికగా విడుదల అయింది. ఘనశ్యామ్ సంగీతాన్ని సమకూర్చగా ఎల్ శ్రీనివాస్ తేజ్ రాసిన ఈ పాటను ఎమ్ ఎమ్ మానసి అద్భుతంగా పాడారు. ఈ ఐటెం సాంగ్ చిత్రంలో ఎంతో స్పెషల్ గా ఉండబోతుంది అని మేకర్స్ అంటున్నారు. అంతే కాకుండా ఈ పాటకు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీలో హీరో…