‘టిల్లు స్క్వేర్‌’ విడుదల మరింత ఆలస్యం!

The release of 'Tillu Square' is further delayed!

‘డీజే టిల్లు’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక, ఈ మూవీ సీక్వెన్స్‌ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ ఈ సెకండ్‌ పార్ట్‌ లో అనుపమ హీరోయిన్‌ కావడంతో మరింత హైప్‌ పెరిగింది. ఇటీవల కొన్ని పాటలు విడుదల చేయగా, అవి చూసిన తర్వాత మరిన్ని అంచనాలు పెరిగాయి. కానీ, ఈ మూవీ మాత్రం విడుదల ఆలస్యమౌతూ వచ్చింది. ఇప్పటికే ఈ మూవీని చాలా సార్లు విడుదల చేస్తామని చెబుతూ వచ్చారు. ప్రతిసారీ వాయిదా పడుతూ వచ్చింది. సెప్టెంబర్‌ లో విడుదల పక్కా అనుకున్నా ఈసారి కూడా వాయిదా పడింది. మూవీ టీమ్‌ విడుదల విషయంలో తాజాగా ఓ ప్రకటన ఇచ్చింది. ఆలస్యమైనా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని వారు చెప్పడం విశేషం. అయితే, ఈ మూవీ వాయిదా పడింది అనే విషయం…