రామ్ పోతినేని – మహేష్ బాబు పి కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న #RAPO22 రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

The Rajahmundry schedule of #RAPO22, produced by Mythri Movie Makers in the Ram Pothineni - Mahesh Babu P combination, has been completed

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. అందుకని #RAPO22ను వర్కింగ్ టైటిల్‌గా వ్యవహరిస్తున్నారు. రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ ముగించుకుని చిత్ర బృందం హైదరాబాద్ వచ్చింది. రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్‌ స్టాప్‌గా డే అండ్ నైట్ షూటింగ్ చేసింది RAPO22 యూనిట్. ఈ షెడ్యూల్‌లో రెండు పాటలతో పాటు ఒక యాక్షన్ సీక్వెన్స్, ఇంకా ఇంపార్టెంట్ టాకీ సీన్స్ షూటింగ్ చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లను అంతే అందంగా క్యాప్చర్ చేశామని చిత్ర బృందం చెబుతోంది.రాజమండ్రిలో జరిగిన చిత్రీకరణలో హీరో రామ్ పోతినేని,…