మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా “చంద్రేశ్వర” మూవీ నుంచి శివుని పాట విడుదల, త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర చారి నిర్మించిన ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘చంద్రేశ్వర’. ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ‘చంద్రేశ్వర’ సినిమాలోని శివుని పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో… నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ – మహా శివరాత్రి పర్వదినం రోజు ‘చంద్రేశ్వర’ సినిమా నుంచి శివుని పాటను రిలీజ్ చేయడం గొప్ప సందర్భం. శివుని పాట చాలా బాగుంది. ఆ శివుడి దయ మీ మీద ఉండాలి. ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన నిర్మాత రవీంద్రచారి, దర్శకుడు పెరుమాళ్ వర్థన్ కు అభినందనలు. సినిమా అంటే ప్యాషన్…