సెలబ్రెటీలు బయటకు వెళ్తే ఎవరో ఒకరు సెల్ఫీ అని లేదా మరేదైనా కారణం చెప్పి దగ్గరకు వచ్చి మాట్లాడేందుకు, టచ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ బౌన్సర్ లు లేకుండా బయటకు అడుగు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది. చుట్టూ ఎంత మంది బౌన్సర్ లు ఉన్నా కూడా కొన్ని సార్లు హీరోయిన్స్ కి అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు అదే పరిస్థితి ఎదురైంది. ఒక కార్యక్రమంకు హాజరు అయిన మిల్కీ బ్యూటీ తమన్నా ను ఫ్యాన్ ఒకరు దూసుకు వచ్చి పట్టుకున్నాడు. ఆమె చేయి పట్టుకోవడంతో పాటు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా తమన్నా షాక్ అయినట్లుగా ఫేస్ పెట్టింది. అంతే కాకుండా ఆమె భపడిరది. బారీకేడ్లు దూకి వచ్చిన అభిమానిని బౌన్సర్ లు తోసేందుకు…