జనసేనాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా… ‘మహా మ్యాక్స్’ ఛానెల్ ప్రారంభం! గత పదిహేను సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ‘మహాన్యూస్’. అయితే, ఒకటిన్నర దశాబ్దంగా తెలుగు వార్తా రంగంలో ‘మహా గ్రూప్’ కొనసాగిస్తున్న మహా ప్రస్థానాన్ని… ఇప్పుడు వినోద రంగానికి కూడా విస్తరించింది. మహా న్యూస్ అధినేత మారెళ్ల వంశీ ‘మహా మ్యాక్స్’ పేరుతో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని జనం ముందుకు తీసుకు వచ్చారు. తెలుగు వారి లోగిళ్లలోని ఈ నవ్యమైన వినోదాల విప్లవం… ‘మహా మ్యాక్స్’ని… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. హైద్రాబాద్ ఫిల్మ్ నగర్లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ లో మహా మ్యాక్స్ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 24న మహా వైభవంగా జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ‘మహా గ్రూప్’…