థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ ఎమోషన్ వెంటాడుతుంది.. ‘అలా నిన్ను చేరి’ దర్శకుడు మారేష్ శివన్

The Emotions In 'Ala Ninnu Cheri' Will Haunt, Even After Leaving Theatre: Director Maresh Shivan

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మంచి ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న ఈ మూవీని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. అన్ని రకాల అంశాలను జోడించి ఈ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించారు. సుభాష్ ఆనంద్ సంగీత దర్శకుడిగా ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాయగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రానికి ఆండ్రూ కెమెరామెన్.. కింగ్ సోలమన్, రామ కిషన్ యాక్షన్ కొరయోగ్రాఫర్స్. నవంబర్ 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో దర్శకుడు మారేష్ శివన్ మీడియాతో ముచ్చటించారు. అలా నిన్ను చేరి ప్రయాణం ఎప్పుడు మొదలైంది? కథ ఎప్పుడు రాసుకున్నారు? ఈ కథను…