భగీరథ సంపాదకత్వంలో ఎన్.టి.ఆర్. కమిటీ వెలువరించిన తారకరామం గ్రంథం ఆధునిక భగవద్గీతని, ప్రతి తెలుగు వారి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అపురూప గ్రంథమని రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ఎన్.టి. రామారావు వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో రూపొందించిన తారకరామం పుస్తక సమీక్ష సమాలోచన శనివారం నాడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ సందర్భంగా రచయితల సంఘం అధ్యక్షులు డా. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ అన్న ఎన్.టి. రామారావు స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూలతో భగీరథ చేసిన మంచి ప్రయత్నమని అన్నగారి అభిప్రాయాలు, ఈ తరతానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఉంటాయని అందుకే తారకరామం ప్రతిఇంటిలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి మహాగ్రంథమని చెప్పారు. జొన్నవిత్తుల మాట్లాడుతూ ఎన్.టి. రామారావుగారు చాలా స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారని, నటుడిగాను, వ్యక్తిగానూ, జీవితంలో రాజీపడలేదని తారకరామం పుస్తకం ఎన్.టి.ఆర్.…