బస్తీలో ఉండే తండ్రీ కొడుకులు.. పూట గడిస్తే చాలనుకునే చాలీ చాలని సంపాదన.. అలాంటి ఓ పేద కుటుంబంలోని ఉండే పిల్లాడుకి విమానం ఎక్కాలనే కోరిక పుడుతుంది. తండ్రి అవిటితనంతో బాధపడుతున్నప్పటికీ కొడుకు కోరికను తీర్చాలనుకుని రాత్రి పగలు కష్టపడుతుంటాడు. విమానం ఎక్కాలనుకునే కొడుకు కోరికను తీర్చటానికి ఏం చేయాలా? అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్… సుమతీ అనే అమ్మాయిని ప్రేమించే కోటి.. లోకమంతా తనను కామంతోనే చూస్తుందని భావించే ఆమెకు తనను మనస్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడని తెలియగానే ఆమె హృదయంలో నుంచి వచ్చే ఆవేదన.. ఇది రెండు హృదయాల మధ్య ఉండే ఎమోషన్.. హృదయాన్ని తాకే ఈ ఇలాంటి భావోద్వేగాల వ్యక్తుల ప్రయాణాన్ని తెలియజేసే చిత్రమే ‘విమానం’. అని ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే స్పష్టమవుతంఉది. శివ ప్రసాద్…