హైదరాబాద్‌లో తమ సరికొత్త షోరూమ్‌ని ప్రారంభించిన లగ్జరీ రీటైలర్‌లో అగ్రగామి అజా ఫ్యాషన్స్!

Tamannah Bhatia attends special guest for AZA Fashions' new store launch in Hyderabad

స్పెషల్ గెస్ట్‌గా విలక్షణ, పాపులర్ నటి తమన్నా భాటియా ఫిబ్రవరి 10, 2023: ఇండియన్‌ ఫ్యాషన్‌ రంగంలో అగ్రగామిగా పేరుంది అజా ఫ్యాషన్స్‌కి. మోడ్రన్‌ లగ్జరీ సర్వీసులలో అత్యుత్తమంగా పేరు తెచ్చుకున్న అజాను డాక్టర్‌ అల్కా నిషార్‌ 2005లో ప్రారంభించారు. ఇప్పుడు ఇండియాలో లీడింగ్‌ ఫ్యాషన్‌ అథారిటీగా వెలుగుతోంది అజా. ముంబై, ఢిల్లీలో ఇప్పటికే పలు స్టోర్‌లున్నాయి అజాకి. తాజాగా హైదరాబాద్‌లో సరికొత్తగా స్టోర్‌ని ప్రారంభించింది. భాగ్యనగర వాసులకు సరికొత్త షాపింగ్‌ ఎక్స్ పీరియన్స్ అందించడానికి అజా కృషి చేస్తోంది. వినియోగదారుల సంతృప్తి, వ్యక్తిగతమైన సేవలలో అత్యుత్తమ ప్రతిభ, అనితరసాధ్యమైన శ్రద్ధను కనబరుస్తుంది అజా. అజా హైదరాబాద్‌ స్టోర్‌ని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఫిలాన్‌థ్రాఫిస్ట్ పింకీ రెడ్డి స్వర్ణహస్తాలతో ప్రారంభించారు. అజా వ్యవస్థాపకుడు, ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ అల్కా నిషార్‌ అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు. మేనేజింగ్‌ డైరక్టర్‌ దేవాంగి పరేఖ్‌…