‘చంద్రముఖి 2’ వినాయక చవితికి సినిమా గ్రాండ్ రిలీజ్ స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోన్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తోంది. సుభాస్కరన్ నిర్మాత. శుకవ్రారం ఈ సినిమా నుంచి ‘స్వాగతాంజలి…’ అనే లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కంగనా రనౌత్ అభరణాలను ధరించి రాజనర్తకి చంద్రముఖిలా డాన్స్ చేయటాన్ని చూడొచ్చు. ఇక సినిమా కోసం వేసిన సెట్స్, కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ కాస్ట్యూమ్స్ వావ్ అనిపిస్తున్నాయి. ఇక ఆస్కార్…