ఓటీటీలో ఎక్కువ ఆదరణ పొందుతున్న జానర్స్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే “రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి” సినిమాపై ఓటీటీ ప్రేక్షకులకు అంతగా అభిమానం ఏర్పడింది. ఎట్టకేలకు ఈ సినిమా అమోజాన్ ప్రైమ్స్ లో అందుబాటులోకి రావడంతో సంతోషం. తన్విక, మోక్షిక క్రియేషన్స్ బానర్ పై రాజేష్ గురజావోలు నిర్మించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి’. సత్యరాజ్ కుంపట్ల దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టింది. తాజాగా ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి పెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ లో నిమా స్ట్రీమింగ్ అవుతుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమాలో…