వేతన వ్యవస్థను అమలు చేయడంలో కేంద్రం విఫలం త్వరలో జర్నలిస్టులకు మెరుగైన హెల్త్ కార్డుల జారీ సోషల్ మీడియా ద్వారా వాస్తవ విషయాలు వెలుగులోకి.. రోజురోజుకు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్న మీడియా సంస్థలు దేశంలో జర్నలిస్టులను, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను ఒకే తాటిపైకి తెచ్చి ఇండ్ల స్థలాలు విషయంలో ఇచ్చిన తీర్పు చాలా నిరాశపరిచిందని, ఈవిషయంలో వాస్తవాలను గ్రహించకుండానే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులతో స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను కలిపి తీర్పు ఇవ్వడం చాలా దురదృష్టకరమన్నారు. సోమవారం నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో జర్నలిస్టులందరికీ ఒకే రకమైన వేతనాలు అంటూ ఏమీ లేవని…