’పుష్ప: ది రైజ్’ చిత్రంలో నటనకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. దీంతో ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు స్టార్‌గా నిలిచాడు. ఈ ప్రత్యేక సందర్భంలో రష్మిక మందన్న తన సహనటుడు అల్లు అర్జున్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ చిత్రంలో పుష్పరాజ్ ని ప్రేమించి పెళ్లాడే ఇష్టసఖి శ్రీవల్లిగా రష్మిక నటించిన సంగతి తెలిసిందే. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డురావడంపై రష్మిక మందన్న ఆనందం వ్యక్తం చేసింది. ఉల్లాసంగా ఉరుములతో కూడిన చప్పట్లతో నిండిన గదిలో బన్ని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను రష్మిక రీషేర్ చేసింది. బన్నీకి హృదయపూర్వక అభినందనలు తెలిపింది. తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ’పుష్పరాజ్.. అసలు తగ్గేదేలే..అభినందనలు.. ఇది…