‘ఆదికేశవ’ నుంచి ‘సిత్తరాల సిత్రావతి’ పాట విడుదల!

'Sittarala Sitravati' song released from 'Adikesava'!

వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదికేశవ’ శ్రీలీల కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంతో అపర్ణా దాస్‌, జోజు జార్జ్‌ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంతో శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకుడిగా పరిచయమవు తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘సిత్తరాల సిత్రావతి’ అంటూ సాగే పాటను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది. హీరోహీరోయిన్ల మధ్య సాగే మెలోడీ సాంగ్‌ ఇది. హీరో హీరోయిన్‌ను ‘సిత్తరాల సిత్రావతి’ అని పిలుస్తూ, ఆమె అందాన్ని పొగుడుతూ పాడే పాట ఇది. దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌,…