# సింగిల్ సినిమా సమ్మర్ రొమాంటిక్ కామెడీ ఆఫ్ ద ఇయర్…ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు : హీరోయిన్ కేతిక శర్మ

# Single Movie Summer Romantic Comedy of the Year...You will definitely enjoy it: Heroine Ketika Sharma

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. #సింగిల్ మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కేతిక శర్మ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ ప్రాజెక్టు లోకి ఎలా వచ్చారు ? గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది…