సెప్టెంబర్ 15న ‘ఛాంగురే బంగారురాజా’ విడుదల

Ravi Teja’s RT Teamworks, Frame By Frame Pictures, Satish Varma’s Changure Bangaru Raja Releasing On September 15th

మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్ మరో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ తో రాబోతోంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మిస్తున్నారు. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యూసర్స్. ఈరోజు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. పండగ సెలవు సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఫేవర్ కానుంది. ప్రధాన తారాగణంతో కూడిన రిలీజ్ డేట్ పోస్టర్ హ్యుమరస్ గా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ‘C/o కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. మేకర్స్ ఇదివరకే ఈ…