‘ఖుషి’ ప్రమోషన్స్‌లో పాల్గొననున్న సమంత

Samantha will participate in the promotions of 'Khushi'

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ’ఖుషి’ చిత్రం సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. చాలా నెలల క్రితమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా సమంత అనారోగ్య కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యం అయింది. విడుదలకు ఇన్నాళ్ల సమయం పట్టింది. సినిమా విడుదల విషయంలో ఎలాంటి డౌట్‌ లేదు.. కానీ సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్‌ కి సమంత హాజరు అయ్యేనా లేదా అనేది గత కొన్ని రోజులుగా సస్పెన్స్‌ గా ఉంది. ఎందుకంటే సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అంతే కాకుండా చికిత్స నిమిత్తం సమంత విదేశాలకు వెళ్లబోతుందనే వార్తలు వస్తున్నాయి. ’ఖుషి’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో సమంత పాల్గొనే అవకాశాలు లేవని అంతా భావించారు. కానీ తాజాగా…