గత వారం చిన్న చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు రాగా.. ఇప్పుడు ఈ నెల చివరి వారంలో మరికొన్ని విభిన్న చిత్రాలు ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. ఓటీటీలోనూ పలు హిట్ చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు కాంబోలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ’గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. వరుణ్‌తేజ్ సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. ఘోస్ట్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ప్రవీణ్ సత్తారు ఈ చిత్రంతో రాబోతున్నారు. ఈ చిత్రం అటు వరుణ్‌కు ఇటు ప్రవీణ్ సత్తారుకు ఎంతో కీలకం. కార్తికేయ, నేహా శెట్టి కలిసి క్లాక్స్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘బెదురు లంక 2012’. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాతగా వ్యవహరించారు. ఈ…