విజయ్‌ దేవరకొండ ఇంట్లో దీపావళి వేడుకలో రష్మిక మందన్న!?

Rashmika Mandanna at Vijay Devarakonda's Diwali celebration!?

చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్‌కు పునరావృత దోషం ఉండదు. ఎన్నిసార్లు చూసినా చూడముచ్చటగా అనిపిస్తాయి. అలాంటి వారిలో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ ఒకటి. ‘గీత గోవిందం’ సినిమాలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాతో ఈ పెయిర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన ఎఫెక్ట్‌తో వీరిద్దరూ మళ్లీ కలిసి ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా చేశారు. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయినా.. వీళ్ల కెమెస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. అయితే అన్‌స్క్రీన్‌లో ఎంత సరదాగా ఉంటారో ఆఫ్‌ స్క్రీన్‌లోనూ వీళ్లు చాలా సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటారు. అయితే గతకొంత కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటారని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు వీరిద్దరూ కలిసి ఒకే లోకేషన్‌లో…