భర్త రాక కోసం..భార్య పడే విరహ వేదన నేపథ్యంలో సింగిల్ క్యారక్టర్ తో రూపొందిన చిత్రం `రారా పెనిమిటి`. శ్రీ విజయానంద్ పిక్చర్స్ బేనర్ లో రూపొందిన ఈ చిత్రంలో సింగిల్ క్యారక్టర్ లో నందిత శ్వేత నటించగా సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించారు. శ్రీమతి ప్రమీల గెద్దాడ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ -రిలీజ్ ఏర్పాటు చేశారు… సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ…“దర్శకుడు ఒక మంచి కథతో వచ్చి కలిశారు. మంచి పాటలు చేసే అవకాశం కల్పించిన దర్శకుడు థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంత వరకు చేసిన కంపోజిషన్ లో నాకు ఇష్టమైన పాటలు ఇందులో ఉన్నాయి. నీలకంఠ చక్కటి సాహిత్యాన్ని సమకూర్చారు. నందిత అద్భుతంగా…