‘లియో’ సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడు అంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే దీని మీద మాత్రం ‘లియో’ యూనిట్ రియాక్ట్ అవడం లేదు. సినిమా దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది అడిషనల్ ప్రమోషన్ కింద వాళ్ళు లెక్క కడుతున్నారు. సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడా? లేదా? అనే విషయంపై వాళ్లు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. లోకేష్ కనకరాజ్ కూడా దీని మీద సైలెన్స్ మైంటైన్ చేస్తున్నాడు. సినిమాకు ఎలాగూ ప్రమోషన్ వస్తుంది కాబట్టి.. అనవసరంగా మాట్లాడి దాని గురించి ఓపెన్ అవ్వడం ఎందుకు అనేది యూనిట్ ఆలోచన. వచ్చే అడిషనల్ పబ్లిసిటీ రాని అంటూ వాళ్ళు కూడా ఊరుకున్నారు. ముందు దీని గురించి చరణ్ ఫాన్స్ పెద్దగా పట్టించుకోకపోయినా కూడా రిలీజ్ డేట్ దగ్గర…