తెలుగు సినీ ప్రేక్షకులే కాదు.. భారతీయ ప్రేక్షకులు సైతం ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప 2`. మూడేళ్ల క్రితం వచ్చిన ‘పుష్ప`కి ఈ సినిమా రెండో పార్ట్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. శ్రీలీలా ఐటెమ్ సాంగ్ చేసింది. ఫహద్ ఫాజిల్, జగపతిబాబు నెగటివ్ రోల్స్ చేశారు. అనసూయ, సునీల్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అల్లు అర్జున్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 2021 డిసెంబర్‌లో వచ్చిన ‘పుష్ప’ పార్ట్ 1 విడుదలైనప్పుడు ఆ సినిమాని బాగా ట్రోల్ చేశారు. అయితే.. సినిమా విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్ అసలు ఎవరూ ఊహించి ఉండరు. బహుశా దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ కూడా ఉహించి ఉండరంటే…